వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్‌కు శుభారంభాన్ని అందించలేకపోయింది. ఆరంభ మెరుపుల తర్వాత ఆ సినిమా చల్లబడిపోయింది. తర్వాతి వారం వచ్చిన సినిమాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. కానీ ఈ వారం రాబోయే రెండు సినిమాలు మాత్రం ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
శర్వానంద్ మోటార్ స్పోర్ట్స్ మూవీ ‘బైకర్’తో పాటు.. సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఫాంటసీ ఎంటర్టైనర్ ‘రాకాస’ ఈ శుక్రవారం బాక్సాఫీస్ బరిలో నిలిచాయి.
ఈ రెండు చిత్రాల మీద ఎంతో నమ్మకంగా ఉన్న మేకర్స్ ఒక రోజు ముందే పెయిడ్ ప్రిమియర్స్ ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లో ఈ రెండు చిత్రాలకు రెండంకెల సంఖ్యలో షోలు పడుతున్నాయి. ముందు రెండు చిత్రాలకూ పరిమిత థియేటర్లలో కొన్ని షోలు వేయాలి అనుకున్నారు. కానీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాక ఆ షోలకు వచ్చిన రెస్పాన్స్ చూశాక.. షోలు పెరుగుతూ వెళ్లాయి.
‘బైకర్’ మూవీకి ముందు ప్రిమియర్ మల్టీప్లెక్స్ థియేటర్లలో మాత్రమే షోలు మొదలుపెట్టి.. ఆ తర్వాత వేరే మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లలో కూడా షోలు ఓపెన్ చేశారు. ఈ చిత్రానికి 30కి పైగానే ప్రిమియర్ షోలు పడుతున్నాయి హైదరాబాద్‌లో. మెజారిటీ షోలు సోల్డ్ ఔట్ దిశగా వెళ్తున్నాయి.
ఇక ‘బైకర్’తో పోలిస్తే ‘రాకాస’ చిన్న సినిమా అయినా.. దానికి కూడా పెద్ద సంఖ్యలోనే ప్రిమియర్లు పడుతున్నాయి. ఒక్కో మల్టీప్లెక్సులో రెండు మూడు షోలు వేస్తున్నారు. కొన్ని సింగిల్ స్క్రీన్లలో కూడా షోలు పడుతున్నాయి. దానికీ హైదరాబాద్‌లో షోల సంఖ్య 30 దాటిపోయింది. చాలా షోలు ఫుల్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ రెండు చిత్రాలకూ ఏపీలో వైజాగ్, విజయవాడల్లోనూ ప్రిమియర్స్ వేస్తున్నారు. వాటికీ రెస్పాన్స్ బాగుంది. మొత్తానికి ప్రిమియర్స్ బుకింగ్స్ చూస్తుంటే ఎంతో ఆశాజనకంగా ఉంది. రెండూ బలమైన కంటెంట్ ఉన్న సినిమాల్లానే కనిపిస్తున్నాయి. ప్రిమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తే.. శుక్రవారం రెండు చిత్రాలకూ మంచి ఓపెనింగ్స్ ఆశించవచ్చు. వీకెండ్లో థియేటర్లు కళకళలాడొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
