మూడు నెలల గ్యాప్ లో రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన దర్శకుడిగా ఆదిత్య ధార్ పేరు దేశమంతా మారుమ్రోగిపోతోంది. ఇప్పటికిప్పుడు ఏ స్టార్ కి ఫోన్ చేసినా ఆఘమేఘాల మీద డేట్స్ ఇచ్చేలా ఉన్నారు. చాలా తక్కువ టైంలో ఇంత హై క్వాలిటీ మూవీ ఇవ్వడం చూసి ఎందరో డైరెక్టర్లకు కునుకు రావడం లేదు. ఫిలిం మేకింగ్ కి కొత్త డెఫినేషన్ ఇచ్చిన ఆదిత్య ధార్ నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ముంబై వర్గాల కథనాల ప్రకారం ఆదిత్య ధార్ ప్రస్తుతం చంద్రగుప్త మౌర్య కథ మీద వర్క్ చేస్తున్నారట. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందిన ఈ వీరుడి గాథలో అద్భుతమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పాటలీపుత్రని (ఇప్పటి పాట్నా) పాలించిన చంద్రగుప్తుడికి నందరాజుల చేతిలో అవమానాలు పొందిన చాణుక్యుడితో పరిచయం ఏర్పడ్డాక అత్యంత శక్తివంతుడిగా ఎదుగుతాడు. అలెగ్జాండర్ చనిపోయాక గ్రీకు ప్రతినిధులను ఓడించి పంజాబ్, సింధ్ లనుం సొంతం చేసుకుంటాడు.
జీవితం చివర్లో జైన మతాన్ని స్వీకరించిన చంద్రగుప్తుడు గొప్ప ఆదర్శాలను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈయన మనవడే అశోక చక్రవర్తి. తెలుగులో స్వర్గీయ ఎన్టీఆర్ ఈ బ్యాక్ డ్రాప్ లోనే స్వీయ దర్శక నిర్మాణంలో ఏఎన్ఆర్, శివాజీ గణేశన్ లతో కలిసి చాణక్య చంద్రగుప్తను భారీ బడ్జెట్ తో స్వంత బ్యానర్ లో తీశారు. కానీ అది ఫెయిల్ అయ్యింది. దూరదర్శన్ లో 90 దశకంలో వచ్చిన సీరియల్ పెద్ద హిట్టు. తర్వాత మళ్ళీ ఎవరూ ఈ సబ్జెక్టు జోలికి వెళ్ళలేదు.
ఇప్పుడు ఆదిత్య ధార్ దీని టేకప్ చేస్తే పెద్ద సాహసమే అవుతుంది. ఎందుకంటే తన మీద అంచనాలు మాములుగా లేవు. అయితే రీసెర్చ్ విషయంలో చాలా పక్కాగా ఉండే ఈ కల్ట్ దర్శకుడు ఎప్పడూ చూడని డీటెయిల్స్ చూపించడం మాత్రం ఖాయం. ఇప్పటికైతే ఇది ప్రచారంలోకి వచ్చింది కానీ ఎంతమేరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చేదాకా చెప్పలేం. అన్నట్టు చంద్రగుప్తుడిగా మొదటి ఛాయస్ ఎవరనుకుంటున్నారు. అదే జస్కి రాత్ అలియాస్ హంజా ఉరఫ్ రణ్వీర్ సింగే.
This post was last modified on March 29, 2026 10:25 pm
ఒకప్పుడు చదువు పూర్తవగానే మంచి ఉద్యోగం సంపాదించడం, సొంత ఇల్లు కొనుక్కోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలతో స్థిరపడటం.. ఇవే జీవితంలో…
తెలంగాణలో కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలంటే సామాన్యులు, మధ్యతరగతిప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
అనంతపురం జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు.. జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీ…
నవంబర్ 12 శర్వానంద్ భోగి సినిమా విడుదల. అనౌన్స్ మెంట్ ఎప్పుడో ఇచ్చారు. ఆల్రెడీ టీజర్, లిరికల్ సాంగ్ రెండూ…
గ్యాస్ సిలిండర్ డెలివరీ అంటే కేవలం వినియోగదారుడి ఇంటికి దానిని చేర్చడం మాత్రమే కాదు. సిలిండర్ భద్రత, గ్యాస్ లీకేజీని…
కొన్ని రోజుల నుంచి ప్రచారంలో ఉన్న వార్త నిజమే అని తేలింది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడైన మెగా…