సంక్రాంతికి విడుదల కావాల్సిన జన నాయకుడు వాయిదా పడ్డాక మళ్ళీ ఎప్పుడు విడుదలవుతుందో అర్థం కాక అభిమానులు నిన్నా మొన్నటి దాకా తెగ ఖంగారు పడ్డారు. తాజాగా తమిళనాడులో ఎన్నికల హడావిడి మొదలైపోవడంతో దాన్ని మర్చిపోయి టీవీకే పార్టీ కోసం ప్రచార పర్వంలో బిజీ అయిపోయారు. హీరో విజయ్ ఎలెక్షన్ క్యాంపైన్లు, ఎంక్వయిరీలు, పిటీషన్లు అంటూ క్షణం ఊపిరి సలపకుండా తిరుగుతున్నాడు. అందుకే సినిమా సైలెంట్ అయ్యింది.
ఓటిటి డీల్ నుంచి అమెజాన్ ప్రైమ్ వెనక్కు తగ్గిందనే వార్త వచ్చాక ఒక్కసారిగా జన నాయకుడి మీద బజ్ ఇంకా తగ్గిపోయింది. ముందు అనుకున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సైతం చేతులు ఎత్తేయడంతో ఇప్పుడు కొత్త పంపిణీదారుడు కోసం వెతుక్కోవాలి. ఇదంతా టైం పట్టే ప్రాసెస్. ఈలోగా కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన కేడి ది డెవిల్, టాక్సిక్ విడుదలైపోతాయి కాబట్టి ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. తర్వాత జన నాయకుడు సెన్సార్ వ్యవహారాలు చూస్తారు.
ఈ లెక్కన జన నాయకుడు జూలై కన్నా ముందు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఎందుకంటే ఏప్రిల్ చివర్లో కేడి డెవిల్, జూన్ మొదటివారంలో టాక్సిక్ ఆల్రెడీ అఫీషియల్ గా ఫిక్స్ చేశారు. సో విజయ్ సినిమా ఆపై నెలలోనే రావాలి. అప్పటికంతా ఎన్నికల ఫలితాలు వచ్చేసి ఉంటాయి. విజయ్ గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడా, జన నాయకుడుకి భీభత్సమైన అడ్వాంటేజ్ ఉంటుంది. వసూళ్ల వరద పారి అంచనాలకు అందని కలెక్షన్లు వస్తాయి.
లేదూ ఓడిపోయాడా ఫ్యాన్స్ తిరిగి జై విజయ్ అంటూ థియేటర్లకు పరిగెడతారు. కాకపోతే పొలిటికల్ లీడర్ గా విజయ్ చేసుకున్న డ్యామేజ్ ఏదైనా ఉంటే మటుకు అది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడున్న స్టాలిన్ సర్కారే మళ్ళీ వస్తే మటుకు విడుదల ఆగదు కానీ ఎంతో కొంత నెగటివ్ ఎఫెక్ట్ జన నాయకుడు మీద ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి సున్నా నుంచి ప్రయాణం మొదలుపెట్టాల్సిన జన నాయకుడు చివరికి ఏం చేస్తాడో.
This post was last modified on March 28, 2026 11:19 pm
2027 సంవత్సరంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో భారీ చిత్రాలు రిలీజవుతున్నాయి. కానీ వాటిలో అత్యధిక అంచనాలున్నది వారణాసి మీదే…
తింటే గారెలు తినాలి.. అలానే పుల్లారెడ్డి స్వీట్స్ తినాలి! అంటూ దాదాపు 50 ఏళ్లుగా తెలుగు వారి నోటిని తీపి…
పెద్దగా ప్రమోషన్ల హడావిడి లేకుండా రిలీజ్ కు ముందు కాసింత నెగటివ్ వైబ్స్ తో వచ్చిన జైలర్ 2 అనూహ్యంగా…
తాజాగా సంభవించిన ఆర్నబ్ తుఫాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో జరిగిన నష్టం.. సుమారు 4600 కోట్ల రూపాయల వరకు…
త్రివిక్రమ్ రచనలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి కల్ట్ మూవీస్ చేశాడు విక్టరీ వెంకటేష్. ఐతే మాటల మాంత్రికుడి…
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది సామెత. అదిప్పుడు నిజమయ్యే సూచనలు కానవస్తున్నాయి. అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు…