Movie News

రామ్ రూటు మార్చడం మంచిదేనా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ చాలా విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్నాడు. వారియర్ లాంటివి డిజాస్టర్ అయితే అందులో స్వీయ తప్పిదమో దర్శకుడి మిస్టేకో అనుకోవచ్చు. కానీ పాజిటివ్ టాక్ వచ్చిన ఆంధ్రకింగ్ తాలూకాకి ఫ్లాప్ ముద్ర దక్కడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మరీ ఎక్స్ ట్రాడినరి కంటెంట్ కాకపోయినా నిరాశపరిచే ఎలిమెంట్స్ అయితే లేవు. అయినా సరే ప్రేక్షకులకు ఇందులో ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ ఉన్న కథ కనెక్ట్ కాలేదు.

దీని సంగతలా ఉంచితే అయిదు నెలలు దాటుతున్నా రామ్ కొత్త మూవీ ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. ఎవరెవరో కథలు చెప్పారు. ఎన్నెన్నో విన్నాడు. తనే స్వయంగా ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఏవీ ముందుకు వెళ్ళలేదు. ఫైనల్ గా ఒక కోలీవుడ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. లోకేష్ కనగరాజ్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన లోగి విగ్నేష్ చెప్పిన స్టోరీ నచ్చడంతో దానితోనే ప్రొసీడ్ అవ్వొచ్చని అంటున్నారు. త్వరలోనే ప్రకటన వస్తుంది.

లోకేష్ అసోసియేట్ అంటే టాలెంట్ ఉన్నవాడే అయ్యుంటాడు. పైగా యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటిదాకా దాకా రాని డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో సబ్జెక్టు రెడీ అయ్యిందట. డెబ్యూ మూవీగా లోకేష్ చేసిన మానగరం అప్పట్లో ఆడియన్స్ ని ఎంత సర్ప్రైజ్ చేసిందో తెలిసిందే. గురువు దారిలోనే శిష్యుడు ప్రయాణం చేస్తున్నట్టు తెలిసింది. అయితే నిర్మాణ సంస్థ ఫైనల్ కాలేదు. మైత్రి నుంచి దిల్ రాజు దాకా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి కానీ లాకయ్యేది ఎవరో తెలియాల్సి ఉంది.

తమిళ దర్శకుడితో రామ్ కు చేదు అనుభవం గతంలో ఉంది. లింగుస్వామిని గుడ్డిగా నమ్మి ది వారియర్ చేయడం తగిన మూల్యాన్ని చెల్లించేలా చేసింది. అయితే ఇందులో రామ్ దే పొరపాటు. ఫామ్ లో లేని సీనియర్ కోలీవుడ్ డైరెక్టర్ ని గుడ్డిగా నమ్మేసి రొట్ట రొటీన్ సినిమా చేయడం పాజిటివ్ రిజల్ట్ ఇవ్వలేదు. రియలైజ్ అయ్యేలోపే డ్యామేజ్ జరిగిపోయింది. కానీ లోగి విగ్నేష్ యువ రక్తం కాబట్టి నమ్మకం పెట్టుకోవచ్చు. స్టార్ట్ చేస్తే ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది.

This post was last modified on March 24, 2026 10:01 pm

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

3 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

4 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

5 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

5 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

7 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

8 hours ago