Movie News

చిన్న హీరోకు ‘దేత్తడి’ మాస్ టచ్

తమ ఫ్యామిలీ నుంచి పరిచయమైన హీరోగా ఆశిష్ ని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ పెద్ద కంకణమే కట్టుకున్నారు. రౌడీ బాయ్స్ ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా, లవ్ మీ ఈఫ్ యు డేర్ దారుణంగా ఫెయిలైనా తన మీద పెడుతున్న బడ్జెట్ లను అంతకంత పెంచుకుంటూ పోతున్నారు తప్పించి రాజీ పడటం లేదు. ఇప్పుడు దేత్తడితో ఆశిష్ లోని మాస్ టచ్ ని బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ లో టీజర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది.

వర్షం అవాంతరం వల్ల ఏర్పాట్లకు ఇబ్బంది కలిగినా ఫైనల్ గా లాంఛనం అయితే ముగించారు. తెలంగాణలో పుట్టి పెరిగి హైదరాబాద్ కల్చర్ లో కీలకమైన బ్యాండ్ బృందం నాయకుడిగా ఆశిష్ కి ఊర మాస్ యాంగిల్ జోడించారు దర్శకుడు ఆదిత్య రావు. ప్రముఖ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, సూపర్ విజన్ తో పాటు డైలాగులు కూడా రాశారు. విజువల్స్ గట్రా చూస్తుంటే ఒక్క ఎపిసోడ్ కే ఇంత ఖర్చు పెట్టారా అనిపించక మానదు.

చిన్న హీరో మీద ఇంత పెద్ద కాన్వాస్ అంటే సాహసమే అని చెప్పాలి. అయితే కథ మీద నమ్మకంతో దిల్ రాజు పెద్ద రిస్క్ కు రెడీ అయ్యారు. జునైద్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ క్రేజీ డ్రామాకు సాయి ప్రకాష్, సూర్య బాలాజీ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. హీరోయిన్, ఇతర క్యాస్టింగ్ తదితర వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఇందులో కంటెంట్ ఉంటుందని దిల్ రాజు హామీ ఇస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాంకు ముందు వరస ఫ్లాపులతో సతమతమైన దిల్ రాజు మళ్ళీ ఇప్పుడు స్పీడ్ పెంచారు. దేత్తడి లాంటి మీడియం బడ్జెట్ వెంచర్స్ తో పాటు రౌడీ జనార్ధన లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ ని ఒకేసారి సెట్స్ మీద ఉంచారు. ఇంకోవైపు డిస్ట్రిబ్యూటర్ గా కూడా భారీ చిత్రాల హక్కుల కోసం పోటీ పడుతున్నారు. ఇకపై నాన్ స్టాప్ సక్సెస్ లు అందుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న దేత్తడి ఆంధ్ర జనాలను ఎలా అలరిస్తుందో చూడాలి.

This post was last modified on March 24, 2026 9:41 pm

Share

Recent Posts

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

33 minutes ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

45 minutes ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

6 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

8 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

8 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

9 hours ago