దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద వచ్చాయి కానీ నాలుగు వేల కోట్లతో నిజంగా తీశారానే అనుమానాలు అలాగే ఉండిపోయాయి. అవసరానికి మించిన గ్రాండియర్ నెస్ జొప్పించారనే కోణంలో విమర్శలు చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. కొన్ని సంఘాలు ఏకంగా తమకు ముందు చూపించి రిలీజ్ చేయాలని, చరిత్రను వక్రీకరించినట్టుగా అనుమానం ఉందని వివాదాలు మొదలుపెట్టడం గమనార్హం.
ఒకరకంగా చెప్పాలంటే రామాయణకు అంచనాల మీటర్ పరిమితంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే చాలా కీలకమైన ఘట్టాలు మొదటి భాగంలో ఉండవు. హనుమంతుడి ఎంట్రీ, రామసేతు నిర్మాణం, సంజీవని పర్వతం ఎపిసోడ్, లంకా దహనం, భీకర రామ రావణ యుద్ధం ఇవన్నీ సీక్వెల్ లోనే ఉండబోతున్నాయి. ఆదిపురుష్ సింగల్ పార్ట్ కాబట్టి ఈ సమస్య రాలేదు. ఓంరౌత్ మూడు గంటలోపే మొత్తం చూపించాడు. కానీ రామాయణ డీటెయిల్డ్ గా వెళ్లనుంది.
మరి ఇప్పుడేం చూపిస్తారనే డౌట్ ప్రేక్షకుల్లో కలుగుతుంది కదా. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రామ లక్ష్మణుల పరిచయం, సీత స్వయంవరం, పధ్నాలుగు సంవత్సరాల వనవాసం, అడవిలో ఎదురుకున్న కష్టాలు, శూర్ఫణఖకు అవమానం, రావణుడి ప్రతిజ్ఞ, సీతను ఎత్తుకెళ్లేందుకు బిక్షగాడిగా రావడం ఇవన్నీ ఈ ఏడాది చూసుకోవచ్చు. లంకకు సీతమ్మని చేర్చిన తర్వాత శుభం కార్డు వేస్తారని, యష్ పాత్ర నిడివి పార్ట్ 1లో తక్కువగా ఉంటుందని సమాచారం.
2027లో విడుదల కాబోయే సీక్వెల్ కు బిజినెస్ భారీగా జరగాలంటే ముందీ రామాయణ 1 బ్లాక్ బస్టర్ కావడం అవసరం. వచ్చే నెల నుంచి ప్రమోషన్ల వేగం పెంచబోతున్నారని తెలిసింది. వివిధ దేశాల్లో ఈవెంట్స్ ప్లాన్ చేయబోతున్నారు. బ్రహ్మాస్త్రకు చేసినట్టే రన్బీర్ కపూర్ తెలుగు వెర్షన్ కోసం ప్రత్యేక పబ్లిసిటీలో భాగం కావడానికి రెడీ అవుతున్నాడట. సాయిపల్లవితో పాటు టీమ్ మొత్తం భారీ టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. 3డి ట్రైలర్ ని ఇప్పటికే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే షోలలో ప్రదర్శిస్తున్నారు.
This post was last modified on August 5, 2026 5:19 pm
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్‌ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…
మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులకు ఆయన ఈ విషయంలో…
ఇంకో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రానుంది. గుంటూరు కారం తర్వాత తన దర్శనం స్క్రీన్…