Movie News

క్షమాపణలు చెప్పిన నాయుడు గారి అబ్బాయి

తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్‌కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది. సినిమాల గురించే కాక సామాజిక, రాజకీయ అంశాల మీద కూడా చాలా నిక్కచ్చిగా మాట్లాడతాడని పార్తీబన్‌కు పేరుంది. ఇటీవల త్రిషను ఉద్దేశించి ఆయన చేసిన ఒక కామెంట్ వివాదాస్పదం కాగా.. తర్వాత క్షమాపణ చెప్పడం, మళ్లీ త్రిష స్పందన చూశాక కోపం వచ్చి ఆమెను ఎటాక్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పుడు పార్తీబన్ మరోసారి సారీ చెప్పారు. అది ఒక తెలుగు సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో తాను యథాలాపంగా చేసిన ఒక కామెంట్ వల్ల కావడం గమనార్హం. ఆ చిత్రమే.. ఉస్తాద్ భగత్ సింగ్. ఇంత సుదీర్ఘ కెరీర్లో తమిళ అనువాదాలతో పలకరించడమే తప్ప, ఎప్పుడూ తెలుగు చిత్రాల్లో నటించని పార్తీబన్.. తొలిసారిగా ‘ఉస్తాద్’ లాంటి పెద్ద సినిమాలో విలన్ పాత్ర చేశారు.

ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో పార్తీబన్ మాట్లాడుతూ.. తాను కూడా తెలుగు వాడినే అంటూ, తాను నాయుడి గారి అబ్బాయిని అని తన మూలాలను వెల్లడించారు. తమిళనాడులోనే పుట్టి పెరగడం వల్ల తనకు తెలుగు రాదని.. త్వరలో నేర్చుకుంటానని చెప్పారు.

ఐతే నాయుడి గారి అబ్బాయిని అని చెప్పడం ద్వారా బహిరంగ వేదికలో తన కులమేంటో బయటపెట్టినందుకు చింతిస్తూ ఇప్పుడు పార్తీబన్ క్షమాపణ చెప్పారు. ఆయన వ్యాఖ్యల మీద పెద్ద వివాదమేమీ లేనప్పటికీ.. తాను అలా తన కులాన్ని వెల్లడిస్తూ ఇలాంటి వేదికల్లో మాట్లాడ్డం సమంజసం కాదని పార్తీబన్ అభిప్రాయపడ్డారు.

తాను కుల వ్యవస్థను తప్పుబడుతూ ఎన్నో సినిమాలు చేశానని.. అలాంటిది తాను ఉద్దేశపూర్వకంగా ఇలా ఎలా మాట్లాడతానని పార్తీబన్ అన్నారు. పొరపాటుగా ఆ ఈవెంట్లో నోరు జారానని.. ఇక ముందు ఇలా జరగకుండా జాగ్రత్త పడతానని పార్తీబన్ స్పష్టం చేశారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ గురువారమే ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పార్తీబన్ రోల్ పవర్‌ ఫుల్‌గా ఉండబోతోందని సమాచారం.

This post was last modified on March 18, 2026 2:11 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

2 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

3 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

4 hours ago