అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. తన సినిమాల ఫలితాలను చూస్తే.. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదనిపిస్తుంది. దర్శకుడిగా తన తొలి చిత్రం ‘పటాస్’ పెద్ద బ్లాక్‌బస్టర్. లేటెస్ట్‌గా ఆయన్నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
మధ్యలో అనిల్ తీసిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్-2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్-3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం.. వీటిలో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్‌బస్టర్లు ఉన్నాయి. అనిల్ సినిమాలు థియేటర్లలో ఇరగాడడమే కాదు.. టీవీల్లోనూ అంతే మంచి ఫలితాన్ని అందుకున్నాయి. తన సినిమాల టీఆర్పీ రేటింగ్స్ చూస్తే అవి ఏ స్థాయిలో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో అర్థమవుతుంది.
అనిల్ రావిపూడి సినిమాల్లో అత్యధిక టీఆర్పీ తెచ్చుకున్న సినిమా.. మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’. ఆ సినిమాకు రికార్డు స్థాయిలో 24.2 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ మూవీ అత్యధికంగా 18.6 రేటింగ్ సాధించింది. వెంకీతో అనిల్ చేసిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ 18.3 రేటింగ్ సాధించింది.
టీఆర్పీ రేటింగ్స్ గత కొన్నేళ్లలో బాగా పడిపోయాయి. అయినా సరే ఈ చిత్రానికి గత ఏడాది ఈ స్థాయిలో రేటింగ్ రావడం విశేషమే. రవితేజ సినిమా ‘రాజా ది గ్రేట్’కు 18.4 టీఆర్పీ వచ్చింది. అది కూడా సూపర్ రేటింగే. ‘సుప్రీమ్’ సినిమాతో అనిల్ రావిపూడి 15.4 రేటింగ్ సాధించాడు. ఇక ఈసారి సంక్రాంతి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని థియేటర్లలో జనం ఎలా ఎగబడి చూశారో తెలిసిందే.
అయినా సరే అది టీవీలో 14.2 రేటింగ్ సాధించడం విశేషం.
అనిల్ రావిపూడి చిత్రాల్లో అతి తక్కువగా ఆడింది ఎఫ్-3 మూవీ. దానికి టీఆర్పీ 9.3 వచ్చింది. పటాస్ కూడా అంతే రేటింగ్ సాధించింది. భగవంత్ కేసరి 9.9 రేటింగ్ తెచ్చుకుంది. అనిల్ మిగతా చిత్రాలతో పోలిస్తే ఈ రేటింగ్స్ తక్కువే కానీ.. మామూలుగా చూస్తే మాత్రం అవి కూడా మంచి టీఆర్పీలే. మొత్తంగా చూస్తే అనిల్ సినిమాలను థియేటర్లలోనే కాదు.. టీవీల్లోనూ జనం విరగబడి చూస్తున్నారని ఈ రేటింగ్స్ చూస్తే అర్థమవుతుంది.
This post was last modified on March 13, 2026 2:37 pm
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…