Movie News

400 కోట్ల రికవరీ సాధ్యమేనా విశ్వంభరా?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యధికంగా రూ.200 కోట్ల బడ్జెట్లో మొదలైన సినిమా.. విశ్వంభర. ఈ సినిమా మొదలయ్యే సమయానికి ఆ బడ్జెట్ చూసే ఔరా అనుకున్నారు. ఇంతకంటే తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ‘సైరా’నే పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. కాకపోతే తర్వాత మార్కెట్ లెక్కలు మారాయి. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. పైగా ఇది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహా ఫాంటసీ మూవీ.. అందులోనూ ‘బింబిసార’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి.. సినిమాకు ఢోకా ఉండదనే అనుకున్నారు.

ఐతే ఈ సినిమా టీజర్ రిలీజయ్యాక లెక్క మారిపోయింది. దాని మీద విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో టీం అలెర్ట్ అయింది. అప్పటిదాకా ఎంతో ఖర్చు పెట్టి తీసిన విజువల్ ఎఫెక్ట్స్ కంటెంట్ అంతా పక్కన పెట్టి మళ్లీ వీఎఫెక్స్ పనులు కొత్తగా మొదలుపెట్టింది. దీని వల్ల సినిమా బాగా ఆలస్యం అయింది కూడా. వీఎఫెక్స్ బడ్జెట్ రెట్టింపవడం.. ఆలస్యం వల్ల వడ్డీల భారం పడడంతో బడ్జెట్ హద్దులు దాటేసింది.

ఐతే ఆ లెక్క మరీ రూ.400 కోట్లకు చేరి ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ తాజాగా కెమెరామన్ ఛోటా కే నాయుడు.. ఈ సినిమా బడ్జెట్ అంత అయినట్లు వెల్లడించి షాకిచ్చాడు. మెగాస్టార్ ఇటీవలే ‘మన శంకర వరప్రసాద్ గారు’తో కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ ఇచ్చారు.

‘విశ్వంభర’ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న విజువల్ వండర్. అయినా సరే.. రూ.400 కోట్ల బడ్జెట్‌ను రికవర్ చేయడం అన్నది చాలా పెద్ద టాస్క్. నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా ఒక వంద కోట్లు రాబట్టినా.. థియేటర్ల నుంచి రూ.300 కోట్ల మేర షేర్ రాబడితే తప్ప ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాని పరిస్థితి. 

అంత షేర్ రావాలంటే మూవీ రూ.500 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేయాలి. అది అంత తేలికైన విషయం కాదు. బాహుబలి, పుష్ప సినిమాల స్థాయిలో పాన్ ఇండియా ప్రేక్షకుల ఆమోదం పొందితే తప్ప సినిమాకు ఆ స్థాయిలో వసూళ్లు రావు. దీన్ని బట్టి ఔట్ పుట్ ఎంత గొప్పగా ఉండాలో అంచనా వేయొచ్చు. మరి ఎంతో టైం తీసుకుని కష్టపడుతున్న వశిష్ఠ అండ్ టీమ్ ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

This post was last modified on March 12, 2026 4:26 pm

Share

Recent Posts

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

7 minutes ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

11 minutes ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

1 hour ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

1 hour ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

2 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

3 hours ago