కాదేది కంటెంట్ కు అనర్హం అంటారు సినీ పెద్దలు. ఇది అక్షరాలా నిజం. డిజిటల్ యుగంలో కేవలం స్టార్ ఎలివేషన్లతోనే సినిమాలు నడవవు. జనాలకు నచ్చేలా తీస్తే ఎవరున్నారో కూడా పట్టించుకోకుండా కనక వర్షం కురిపిస్తారు. దానికి సాక్ష్యంగా ఇటీవలే విడుదలైన తమిళ చిత్రం తాయ్ కిళవి నిలుస్తోంది. రాధికా శరత్ కుమార్ టైటిల్ పోషించిన ఈ మూవీ కేవలం రెండు వారాలకే యాభై కోట్లు దాటడం విశేషం.
సింపుల్ కథతో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామాకు శివ కార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించారు. ప్రవర్తన సరిగా లేని కొడుకులను బయటికి పంపించిన పెద్దావిడ ఊళ్ళో వడ్డీలకు డబ్బులు ఇచ్చి దర్జాగా తిరుగుతూ ఉంటుంది. ఓసారి హఠాత్తుగా పక్షవాతం రావడంతో ఆమె దగ్గర బంగారు నిధి ఉందనే అనుమానంతో పోయినవాళ్లు తిరిగి వస్తారు. అక్కడి నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. అదే తెరమీద చూడాలి.
తాయ్ కిళవికి ఇంత స్పందన రావడానికి కారణం లేకపోలేదు. కోలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జన నాయకుడు వాయిదా పడ్డాక ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయిన దాఖలాలు లేవు. జీవా టిటిటి ఒకటే కొంచెం ఊరట కలిగించగా మిగిలినవి చేతులు ఎత్తేశాయి. దీంతో రాధిక మూవీకి పెద్ద అడ్వాంటేజ్ దొరికింది. దానికి తగ్గట్టే టాక్ బాగుండటంతో ప్రేక్షకులతో సూపర్ హిట్ అందుకుంది.
ప్రస్తుతం తాయ్ కిళవిని ఇతర భాషల్లో డబ్బింగ్ చేసే ఆలోచన జరుగుతోందట. అయితే టైం తక్కువగా ఉండటం, మార్చి 19 దురంధర్ రివెంజ్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి పెద్ద రిలీజుల వల్ల ప్రభావం పడుతుందేమోనని భావించి ఇంకా నిర్ణయంతీసుకోలేదట. ఆ టైంకంతా ఓటిటి విడుదల దగ్గరగా ఉంటుంది కాబట్టి అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకనే కోణం కూడా చూస్తున్నారు. ఇంత విజయం, ఇన్ని ప్రశంసలు సాధించిన ఈ సినిమా దర్శకుడు శివకుమార్ మురుగేషన్ కు ఇది డెబ్యూ మూవీ కావడం గమనార్హం.
This post was last modified on March 9, 2026 11:59 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…