Movie News

సడన్ ఎంట్రీ ఇవ్వనున్న జన నాయకుడు ?

సెన్సార్ వివాదం వల్ల మూడు నెలలుగా వాయిదా పర్వంలో నలిగిపోతున్న జన నాయకుడు విడుదల కోసం నిర్మాత శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయనే తీసిన టాక్సిక్ ఎలాగూ జూన్ కి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఫోకస్ మొత్తం విజయ్ మూవీ మీదే పెడుతున్నారు. కోలీవుడ్ టాక్ ప్రకారం ఇవాళ చెన్నైలో రివైజింగ్ కమిటీ జన నాయకుడు ఎడిటింగ్ వెర్షన్ చూడాల్సి ఉందట.

ఆ మేరకు ప్రొడ్యూసర్ కు మెయిల్ కూడా వెళ్లిందట. అయితే సభ్యుల్లో ఒకరికి హఠాత్తుగా అనారోగ్యం కలగడంతో  మరో డేట్ రావొచ్చని అంటున్నారు. ఒకవేళ కమిటీ కనక జన నాయకుడు చూసి ఆల్ ఓకే అంటే మార్చి 19 రిలీజ్ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. టైం చాలా తక్కువగా ఉన్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన విడుదల వస్తే ఎలా ఉంటుందనే దాని మీద చర్చలు జరుగున్నాయని వినికిడి.

ఇప్పుడు మిస్ అయితే మాత్రం వేసవి కన్నా ముందు వచ్చే ఛాన్స్ ఉండదు. అంటే జూన్ లేదా జూలై దాకా ఎదురు చూడాల్సి ఉంటుంది. తమిళ వర్గాల కథనాల ప్రకారం నిజంగా జన నాయకుడు కనక ఉగాదికి వచ్చే పనైతే బెస్ట్ స్క్రీన్ కౌంట్ వచ్చే బాధ్యత తాము చూసుకుంటామని తమిళ బయ్యర్లు హామీ ఇస్తున్నారట. దురంధర్ రివెంజ్ తాకిడి ఎంత ఉన్నప్పటికీ విజయ్ సినిమా వస్తోందంటే జనాలు ఇంకేవి పట్టించుకోరనే ధీమాలో ఉన్నారట.

ఇదంతా తేలడానికి ఇంకో రెండు మూడు రోజులు పట్టేలా ఉంది. ఒకవేళ మార్చి 19 కనక జన నాయకుడు వచ్చే పనైతే ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో స్క్రీన్ల సర్దుబాటు కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే దురంధర్ రివెంజ్ తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, మరికొన్ని హాలీవుడ్ మూవీస్ రేస్ లో ఉన్నాయి. సో దొరికిన వాటితో సర్దుకుని పోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కాకపోతే టాక్సిక్ నిర్మాణ సంస్థగా కెవిఎన్ కు ఎంతో కొంత బెటర్ సపోర్ట్ అయితే దొరుకుతుంది.

కాకపోతే విజయ్ ఈసారి తెలుగు మార్కెట్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవడానికి ఉండదు. ఎందుకంటే భగవంత్ కేసరి రీమేక్ అని క్లారిటీ రావడం, రన్బీర్ పవన్ సినిమాల నుంచి ఎదురవుతున్న కాంపిటీషన్ దృష్ట్యా గతంలోలా చెప్పుకోదగ్గ రెవిన్యూస్ రాకపోవచ్చు. అసలే రాజకీయంగా తీవ్రమైన వేడిని ఎదురుకుంటున్న విజయ్ కు జన నాయకుడు బయటికి వచ్చి హిట్ అయితే కాస్త రిలీఫ్ దక్కుతుంది.

This post was last modified on March 9, 2026 11:25 am

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

6 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

8 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

8 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

10 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

12 hours ago