కాజ‌ల్ ఇలా అయిపోయిందేంటి?

ఒక‌ప్పుడు టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక కాజ‌ల్ అగ‌ర్వాల్. త‌న‌తో పాటు అనుష్క శెట్టి, త‌మ‌న్నా, స‌మంత లాంటి అగ్ర క‌థానాయిక‌లు ఉన్నా.. త‌మిళం నుంచి త్రిష‌, న‌య‌న‌తార లాంటి వాళ్ల నుంచి పోటీ ఉన్నా.. త‌ట్టుకుని టాప్‌లో కొన‌సాగింది కాజ‌ల్. తెలుగులో మాత్ర‌మే కాక‌.. త‌మిళంలోనూ ఆమె టాప్ స్టార్ల‌తో సినిమాలు చేసింది. హిందీలోనూ అడ‌పాద‌డ‌పా కొన్ని పెద్ద చిత్రాల్లో న‌టించింది. ఐతే హీరోయిన్ల కెరీర్ మ‌రీ సుదీర్ఘంగా ఉండ‌ద‌న్న సంగ‌తి తెలిసిందే.

ఉన్నంత‌లో బాగానే కెరీర్‌ను పొడిగించుకోగ‌లిగిన కాజ‌ల్‌కు ఈ మ‌ధ్య అవ‌కాశాలు బాగా త‌గ్గిపోయాయి. అయినా స‌రే.. కాజ‌ల్‌ను ఆరాధించే అభిమానుల సంఖ్య త‌క్కువేమీ కాదు. ఆమెను వాళ్లంద‌రూ ఉన్న‌త స్థాయిలోనే చూడాల‌నుకుంటారు. అలాంటి వాళ్ల‌ను నిరాశ‌ప‌రుస్తూ ఒక ఈవెంట్లో పాల్గొన‌డం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కాజ‌ల్ అగ‌ర్వాల్ తాజాగా ఒక మండీ హోట‌ల్ ఓపెనింగ్‌కు వెళ్లింది. దానికి సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయిన ఉప్ప‌ల్ బాలు సైతం గెస్ట్‌గా వ‌చ్చాడు. అత‌డితో క‌లిసి కాజ‌ల్ ఒక రీల్ చేసింది. అందులో బాలు ఏం చెబుతుంటే అది చేసింది కాజ‌ల్.

ఆమెను క‌ల‌వ‌డం గురించి ఎగ్జైట్ అవుతూ ఉప్ప‌ల్ బాలు పెట్టిన వీడియో వైర‌ల్ అవుతోంది. కాజ‌ల్ రేంజ్ ఏంటి.. ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు వెళ్ల‌డ‌మేంటి.. వ్యూస్ కోసం వెంప‌ర్లాడే బాలు లాంటి వాళ్ల‌ను ఎంగేజ్ చేస్తూ వీడియో చేయ‌డం ఏంటి అని చంద‌మామ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో వాపోతున్నారు.

ఈ వీడియోలో కాజ‌ల్ లుక్ కూడా ఏమంత గొప్ప‌గా లేదు. ఒక సాధార‌ణ అమ్మాయిలా క‌నిపించింది. దీంతో ఈ ఎవ‌ర్ గ్రీన్ బ్యూటీకి ఏమైంది అన్న ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. కాజ‌ల్‌కు ఇప్పుడు అవ‌కాశాలు త‌గ్గి ఉండొచ్చు కానీ.. త‌న రేంజ్ వేర‌ని.. ఆ స్థాయిని మెయింటైన్ చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఫీడ్ బ్యాక్‌ను ఆమె ఎంత‌మేర తీసుకుంటుందో చూడాలి.