‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత భారతీయ సినీ ప్రేక్షకులు అంతగా ఎదురు చూస్తున్న సీక్వెల్ అంటే ‘కేజీఎఫ్-చాప్టర్ 2’నే. రెండేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా వివిధ భాషల్లో విడుదలై అన్ని చోట్లా సంచలన విజయం సాధించిందీ చిత్రం. కన్నడలో ఈ సినిమా ఆడటం ఆశ్చర్యమేమీ కాదు కానీ.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోనూ అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించడమే ఆశ్చర్యం.
ఇక అప్పట్నుంచి చాప్టర్-2 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కరోనా లేకుంటే ఈ ఏడాది దసరాకే ‘కేజీఎఫ్-2’ సందడి చేసేది. కానీ ఆ మహమ్మారి వల్ల చిత్రీకరణ ఆలస్యమై.. వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఐతే ఇటీవలే షూటింగ్ దాదాపు పూర్తయిన నేపథ్యంలో 2021 వేసవిలో ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు.
ఇప్పటిదాకా ‘కేజీఎఫ్-2’కు సంబంధించి ఒకట్రెండు పోస్టర్లు మినహాయిస్తే ఏమీ విడుదల కాలేదు. ఐతే అతి త్వరలోనే టీజర్ రాబోతోంది. ఇందుకు ముహూర్తం కుదిరింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే జనవరి 8న ‘కేజీఎఫ్-2’ టీజర్ రాబోతోంది. ఆ రోజు హీరో యశ్ పుట్టిన రోజు. ఈ ఏడాది కూడా జనవరి 8న ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా పుణ్యమా అని టీజర్ రావడానికి ఇంకో ఏడాది పట్టేసింది.
డిసెంబరు 21తో ‘కేజీఎఫ్’ విడుదలకు రెండేళ్లు పూర్తయ్యాయి. ఆ సందర్భంగానే టీజర్ గురించి అప్ డేట్ ఇచ్చారు. ‘ఎ గ్లాన్స్ ఇన్ టు ద ఎంపైర్’ అంటూ క్యాప్షన్ జోడించి కేజీఎఫ్ సామ్రాజ్య సింహాసనంపై రాకీ (యశ్) కూర్చున్న ఫొటోతో పోస్టర్ రిలీజ్ చేశారు. మరి సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో టీజర్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిస్తుందో చూడాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలె ఫిలిమ్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 21, 2020 5:53 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…