Movie News

దేవి వర్క్ అంతా స్క్రాప్‌లోకేనా?

ఇంకో రెండు వారాల్లో, ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ముందు అనుకున్న దాని కంటే వారం ముందుగా సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బీజీఎం బాధ్యతల నుంచి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తప్పుకోవాల్సి వచ్చినట్లుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

దేవిశ్రీ టైంలైన్‌కు తగ్గట్లుగా తాము కంటెంట్ ఇవ్వలేకపోయామని.. తాను కంటెంట్ ఇచ్చే సమయానికి దేవి అందుబాటులో ఉండట్లేదని.. ఈ నేపథ్యంలో పరస్పర అంగీకారంతో దేవి బదులు తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నాడని నిన్న ఒక నోట్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

దీన్ని బట్టి చూస్తే ‘ఉస్తాద్’కు దేవి అసలు బీజీఎం పనే మొదలుపెట్టలేదని ఎవ్వరికైనా అనిపిస్తుంది. కానీ అది నిజం కాదని కొన్ని రోజుల ముందు ‘ఉస్తాద్’కు సంబంధించి ఒక ప్రమోషనల్ ఈవెంట్లో దేవిశ్రీ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.

ఆ ఈవెంట్లో పక్కన హరీష్ శంకర్ సహా పలువురు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం ఉండగా.. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీ బీజీఎం వర్క్ గురించి మాట్లాడాడు. ఆల్రెడీ నేపథ్య సంగీతం పని మొదలైందని.. ఫినిషింగ్ స్టేజ్‌లో ఉందని దేవి ఆ సందర్భంగా చెప్పాడు. ఈ విషయం చెప్పడానికి హరీష్ శంకర్ అనుమతిస్తాడో లేదో అని అంటుండగా.. హరీష్ వచ్చి భుజం తట్టాడు.

తర్వాత దేవి కొనసాగిస్తూ.. ఈ సినిమాకు బీజీఎం చేయకముందు సన్నివేశాలు చూసే తమ స్టూడియోలో అందరూ హర్షాతిరేకాలు చేశారని.. బీజీఎం కూడా తోడైతే ఔట్ పుట్ ఊహించుకోండి అన్నట్లు మాట్లాడాడు. సినిమాను హరీష్ వేరే లెవెల్లో తీశాడని.. మిగతా అంతా ఒకెత్తయితే క్లైమాక్స్ మరో ఎత్తు అని కూడా దేవి ఆ సందర్భంగా చెప్పాడు.

మిగతా విషయాలు పక్కన పెడితే.. దేవి మాటల్ని బట్టి చూస్తే అతను బీజీఎం దాదాపుగా ఫినిష్ చేసినట్లే చెప్పాడు. అలాంటపుడు టైం లైన్‌కు సెట్ కాలేదని దేవి స్థానంలో తమన్‌ను తీసుకురావడం అన్నది ఎంత వరకు నిజం అన్నది ప్రశ్నార్థకం. బహుశా దేవి వర్క్ పట్ల సంతృప్తి చెందకపోవడం, అతను ఆలస్యం చేస్తుండడం వల్ల తమన్‌ను ఎంచుకున్నారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. తమన్‌తో బీజీఎం చేయించడం పట్ల దేవి మౌనం పాటిస్తుండడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

This post was last modified on March 6, 2026 6:50 am

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

52 minutes ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

7 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

10 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

10 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

11 hours ago