ఒక ప్రముఖ సినీ నటుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడంటే.. అతడి బలహీనతల మీద అవతలి రాజకీయ పక్షాలు దృష్టిసారించడం.. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో ఏవైనా గొడవలు, వివాదాలు ఉంటే వాటిని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించడం మామూలే. తమిళ టాప్ స్టార్ విజయ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.
తన భార్య సంగీతతో 20 ఏళ్లకు పైగా అన్యోన్యంగానే ఉన్నాడు విజయ్. కానీ కొన్నేళ్ల ముందు వీరి బంధం బీటలు వారింది. అప్పట్నుంచి విజయ్, సంగీత విడిగానే ఉంటున్నారు. తాజాగా ఆమె విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసింది. అదే సమయంలో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని చెప్పడంతో పాటు అనేక ఆరోపణలు చేసింది సంగీత. దీంతో సీనియర్ హీరోయిన్ త్రిషతో విజయ్ బంధం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. వారం రోజులుగా ఈ వ్యవహారం సోషల్ మీడియాను ఊపేస్తోంది. అధికార డీఎంకే పార్టీ ఈ ఇష్యూను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.
ఐతే విడాకుల వ్యవహారం ఎక్కువ రోజులు మీడియాలో నానకుండా దాన్ని ఒక కొలిక్కి తెచ్చేయాలని విజయ్ చూస్తున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోర్టులో కంటే ముందు బయట సెటిల్ చేసుకోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడట. రూ.250 కోట్లకు ఈ సెటిల్మెంట్‌ను పూర్తి చేసేందుకు చూస్తున్నాడట.
భార్య, పిల్లల కోసం ఈ మొత్తాన్ని అందజేయనున్న విజయ్.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్, సంగీత దంపతులకు జేసన్ సంజయ్, సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జేసన్ ప్రస్తుతం దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని సందీప్ కిషన్ హీరోగా రూపొందిస్తున్నాడు. సాషా చదువుకుంటోంది. విజయ్ వ్యక్తిగత విషయాలు మీడియాలో ఎక్కువ రచ్చ కాకుండా వీలైనంత త్వరగా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on March 4, 2026 4:34 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…