Movie News

స్టార్లందరూ చరణ్ బాటలో సాగితే..?

స్టార్ హీరోల సినిమాల్లో అభిమానులు ప్రధానంగా ఆశించేది ఎలివేషన్ సీన్లు.. డ్యాన్సులు, ఫైట్లు. ఇవి ఉంటే, కథ కొంచెం అటు ఇటు అయినా.. అభిమానులే సినిమాను సగం సక్సెస్ చేసేస్తారు. ఐతే స్టార్ల సినిమాల్లో ఎలివేషన్ సీన్లు, ఫైట్లకు లోటేమీ ఉండట్లేదు కానీ.. ఒకప్పట్లా అదిరిపోయే డ్యాన్సులు మాత్రం మిస్సవుతున్నాయనే కంప్లైంట్లు పెరిగిపోయాయి.

చిరంజీవి సహా సీనియర్ హీరోలందరికీ వయసు మీదపడ్డ దృష్ట్యా వారి నుంచి ఇంతకుముందులా డ్యాన్సులు ఆశించలేం. తర్వాతి తరం స్టార్లలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు డ్యాన్సుల మీద మరీ ఎక్కువ ఫోకస్ పెట్టరు. పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కొంచెం శ్రద్ధ పెట్టి స్టెప్పులేశారు. 

వీరి తర్వాతి తరం హీరోల్లో ఇండియాలోనే బెస్ట్ అనదగ్గ సూపర్ డ్యాన్సర్లు టాలీవుడ్ సొంతం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఈ ముగ్గురిలో ఎవరి బెస్ట్ అంటే చెప్పడం కష్టం. కొన్ని చిత్రాల్లో అత్యద్భుతమైన స్టెప్స్‌తో ఈ ముగ్గురూ అభిమానులతో పాటు అందరినీ అబ్బురపరిచారు.

కానీ గత కొన్నేళ్లలో వీరి చిత్రాల్లో డ్యాన్సులకు స్కోప్ తగ్గింది. వీరి పాత్రలు వీర లెవెల్లో డ్యాన్సులు వేసే అవకాశం ఇవ్వలేదు. స్వయంగా ఆ హీరోలు కూడా డ్యాన్సుల మీద ఫోకస్ తగ్గించారని కూడా అనిపిస్తుంది.

ఐతే ‘పెద్ది’ సినిమా కోసం బంధనాలన్నీ తెంచుకుని బయటికి వచ్చేశాడు చరణ్. తొలి పాట ‘చికిరి’లో చరణ్ స్టెప్పులు పాన్ ఇండియా స్థాయిలో యువతను ఒక ఊపు ఊపేశాయి. రీల్స్‌ ప్రపంచాన్ని ఆ పాట ముంచెత్తేసింది. దానికే మెగా అభిమానులు ఎంతో ఆనందపడ్డారు. ఐతే వారిని మరింతగా ఉర్రూతలూగించే పాట ఇప్పుడొచ్చింది.

‘రై రై రా రై’ అంటూ సాగిన కొత్త పాటలో చరణ్ స్టెప్పులు మామూలుగా లేవు. ముఖ్యంగా మధ్యలో ఒక అరనిమిషం నాన్ స్టాప్‌గా చరణ్ వేసిన స్టెప్పులైతే అందరూ నోరెళ్లబెట్టి చూసేలా చేశాయి. సినిమాలో ఈ మూమెంట్ వచ్చినపుడు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. చరణ్ ఈ పాట కోసం మామూలు కష్టపడలేదని అర్థమవుతోంది. ఈ స్టెప్స్ చూసి మెగా ఫ్యాన్స్ ప్రౌడ్‌గా ఫీలవుతున్నారు. 

అదే సమయంలో వేరే స్టార్ల ఫ్యాన్స్ కొంచెం అసూయ చెందుతున్నా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు వస్తున్న స్పందన చూసి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌ల నుంచి కూడా ఫ్యాన్స్ ఇలాంటి డ్యాన్స్ నంబర్స్ ఆశిస్తారనడంలో సందేహం లేదు. కాబట్టి అట్లీ సినిమాలో బన్నీ, ప్రశాంత్ నీల్ చిత్రంలో తారక్ కూడా కథ నుంచి పక్కదోవ పట్టకుండానే డ్యాన్స్ నంబర్లు పెట్టించుకుని.. అభిమానులను మురిపించేలా స్టెప్పులేస్తే అవి ఆ చిత్రాలకు పెద్ద ప్లస్ అవుతాయనడంలో సందేహం లేదు.

This post was last modified on March 3, 2026 7:02 pm

Share

Recent Posts

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

53 minutes ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

1 hour ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

2 hours ago

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

2 hours ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

13 hours ago