Movie News

రీమేక్ కాదని ఎన్నిసార్లు చెప్పాలి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తమిళ బ్లాక్‌బస్టర్ ‘తెరి’కి రీమేక్ అని ఎఫ్పట్నుంచో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని చాన్నాళ్ల పాటు దర్శకుడు హరీష్ శంకర్‌తో పాటు టీం ఖండించలేదు.

కానీ గత ఏడాది చిత్రీకరణ పూర్తవుతున్న దశలో ‘కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్’ అని పోస్టర్ మీద పడడంతో ఇది రీమేక్ కాదని అర్థమైంది. అయినా సరే.. చాలామంది ఇది రీమేకే అని వాదిస్తూ వచ్చారు. హరీష్ శంకర్ మరోసారి తాను చేస్తున్నది రీమేక్ మూవీ కాదని స్వయంగా స్పష్టం చేసినా.. ఆ కొందరి తీరు మారలేదు. దీంతో ఇప్పుడు మరోసారి హరీష్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదనే విషయాన్ని బల్లగుద్ది చెప్పాడు.

తాను ‘గబ్బర్ సింగ్’లో పెట్టిన అంత్యాక్షరి ఎపిసోడ్‌ను ‘తెరి’లో వాడుకున్నారని.. అలాంటి సినిమాను తాను ఎందుకు రీమేక్ చేస్తానని హరీష్ శంకర్ ప్రశ్నించాడు. పోలీస్ కథలు అన్నింట్లోనూ హీరో.. సమాజానికి హాని కలిగించే శక్తుల మీద పోరాడడం కామన్ అని.. గబ్బర్ సింగ్, తెరి, ఇంకా చాలా సినిమాల్లో ఇలాగే ఉంటుందని.. ఆ రకంగా ‘తెరి’తో పోలిక ఉంటుందే తప్ప.. దానికి తన సినిమాకు ఏ పోలికా లేదని హరీష్ స్పష్టం చేశాడు.

తాను ‘దబంగ్’ ఆధారంగా ‘గబ్బర్ సింగ్’ తీసినపుడు.. ఎన్నో మార్పులు చేశానని.. అందుకే ఇన్నేళ్ల తెలుగు సినీ చరిత్రలో ఎన్నో రీమేక్‌లు వచ్చినా సరే, ‘మార్పులు’ అని టైటిల్ కార్డ్‌లో వేసింది తాను ఒక్కడిని మాత్రమే అని.. అది రాజమౌళికి కూడా విపరీతంగా నచ్చి, సినిమాలో అక్కడి నుంచే తాను నవ్వడం మొదలుపెట్టానని తనతో అన్నట్లు హరీష్ గుర్తు చేసుకున్నాడు. 

ఇక ‘భవదీయుడు భగత్ సింగ్’ కాస్తా ‘ఉస్తాద్ భగత్ సింగ్’‌గా మారడం గురించి హరీష్ మాట్లాడుతూ.. ముందు కాలేజీ నేపథ్యంలో కొంచెం క్లాస్ కథ చేయాలని అనుకున్నామని.. ఆ రకంగా కథ తయారు చేశామని.. కానీ అందులో మాస్ ఎలిమెంట్స్ పెట్టడం కష్టమైందని హరీష్ తెలిపాడు. కొందరు ‘భవదీయుడు’ అంటే ఏంటి అని కూడా అడిగారని.. టైటిలే అర్థం కానపుడు సినిమా ఏం అర్థమవుతుందని అనిపించిందని.. అందుకే టైటిలే కాదు, కథ కూడా మార్చేశామని.. ‘గబ్బర్ సింగ్’ స్టయిల్లోనే ఇంకో మాస్ కథ రెడీ చేసి సినిమా తీశామని హరీష్ వెల్లడించాడు.

This post was last modified on March 2, 2026 4:36 pm

Share

Recent Posts

రావిపూడికి రిపేర్ చేయాల్సిన అవసరముందా

ప్రతి సంక్రాంతికి కొత్త సినిమా రిలీజ్ చేయడమే సంకల్పంగా పెట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి జనవరి 12 విడుదలతో…

1 hour ago

ఆ వైద్య కళాశాలలో ఏం జరుగుతోంది?

తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి నుంచి పేద రోగుల‌కు సేవ‌లు అందిస్తున్న నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్…

4 hours ago

టీడీపీ జెండాను తొక్కిన వైసీపీ కార్యకర్తలు.. కరెక్టుగా డీల్ చేసిన గుడివాడ ఎమ్మెల్యే

గుడివాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.  ఎన్నికల ప్రచారంలో  జరుగుతున్న సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు…

4 hours ago

కోర్టుకెక్కుతున్న ‘హనుమాన్’ పంచాయితీ?

2024 సంక్రాంతికి విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్టయిన ‘హనుమాన్’ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆల్రెడీ ‘జై హనుమాన్’…

4 hours ago

క‌లెక్ట‌ర్‌ తోనే పెట్టుకున్న ఎమ్మెల్యే… తమిళనాట రచ్చ రచ్చ!

``నువ్వు కొంచెం గ్లామ‌ర్‌గా ఉండాలి. పంజాబీ డ్ర‌స్.. నీకు బాగుంటుంది. చీర‌ల సెల‌క్ష‌న్ కూడా బాగోలేదు.``- ఇది ఏదో కామాంధుడు…

4 hours ago

అవెంజర్స్ అంటే ఇంత పిచ్చి ఉందా

వచ్చే నెల డిసెంబర్ 17 విడుదల కాబోతున్న అవెంజర్స్ డూమ్స్ డే క్రేజ్ చూస్తుంటే మతి పోవడమనే మాట చిన్నదనిపిస్తుంది.…

4 hours ago