Political News

శారదా భూముల పై రేవంత్ యూటర్న్..

కోకాపేటలో అత్యంత ఖరీదైన 2 ఎకరాల భూములను శారదా పీఠానికి కట్టబెట్టడం సరైంది కాదంటూ తెలంగాణ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దీంతో శారదా పీఠానికి ఇచ్చిన భూములను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

బీఆర్ ఎస్ హయాంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎంతో సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాజశ్యామల యాగం కూడా నిర్వహించారు. అనంతరం ఈ మఠానికి 2 ఎకరాల పైచిలుకు ఖరీదైన భూములను కేటాయించారన్న వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన జీవో కూడా తర్వాత వెలువడింది.

అయితే ఇటీవల తెలంగాణ జలమండలి అధికారులు ఆ ప్రాంతం తమకు అవసరమని కోరడంతో ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై అనేక చర్చలు జరిగాయి. చివరకు ఆదివారం సాయంత్రం నాటికి మఠానికి సంబంధించిన భూముల కేటాయింపును రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ఇక దీనికి ముందే బీఆర్ ఎస్ నాయకులు అలర్ట్ అయ్యారు. శారదా పీఠానికి కేటాయించిన భూములను రద్దు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు ప్రారంభించారు. ఆ తర్వాత బీజేపీ నాయకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. శారదా మఠం భూములను రద్దు చేయడం అంటే హిందువులను అవమానించినట్టేనని బీజేపీ నేతలు ఆరోపించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గి యూటర్న్ తీసుకుంది. వివాదం మరింత పెరగకుండా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును రంగంలోకి దింపింది. ఆయన నేరుగా శారదా పీఠానికి చేరుకుని అధికారులు మరియు ఉత్తరాధికారులతో చర్చలు జరిపారు. సరైన సమాచారం లేకపోవడం వల్లే ఈ గందరగోళం జరిగిందని వివరించారు. మీరు సజావుగా మీ కార్యక్రమాలు కొనసాగించవచ్చని హామీ ఇచ్చారు.

మొత్తానికి శారదా మఠం భూముల విషయంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on March 2, 2026 4:17 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

5 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

7 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

10 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

10 hours ago