ఒక సినీ ప్రముఖుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడంటే.. అతడి వల్ల తమ అస్థిత్వం దెబ్బతింటుందని అనిపిస్తే.. ఆ వ్యక్తిని అనేక రకాలుగా రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ చేయడం మామూలే. తెలుగునాట నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాగే టార్గెట్ అయ్యారు.
వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి మరీ వారిని ప్రత్యర్థులు టార్గెట్ చేశారు. ఇప్పుడు తమిళనాట కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తమిళ వెట్రి కళగం పేరుతో పార్టీ పెట్టి జనాల్లోకి దూసుకెళ్తున్నాడు విజయ్. గత ఏఢాది కరూర్ తొక్కిసలాట ఘటనతో కొంత కాలం డిఫెన్స్‌లో ఉండిపోయాడు విజయ్. కానీ ఈ మధ్య దాన్నుంచి బయటికి వచ్చి మళ్లీ పార్టీలో ఉత్సాహం నింపేలా కార్యక్రమాలు చేస్తున్నాడు.
దీంతో అతణ్ని దెబ్బ కొట్టడానికి రాజకీయ ప్రత్యర్థులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్, త్రిషల మధ్య బంధం గురించి చర్చ మొదలైంది. ఒక నాయకుడు.. విజయ్ ముందు త్రిష ఇంటి నుంచి బయటికి రావాలని వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
ఇంతలో ఇప్పుడు విజయ్ భార్య సంగీత.. తన భర్త నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ఒక నటితో విజయ్ అక్రమ సంబంధం పెట్టుకున్న నేపథ్యంలోనే తాను విడాకులు కోరుతున్నట్లు ఆమె వెల్లడించింది. సంగీత.. ఆ నటి పేరు చెప్పకపోయినా, అందరూ త్రిష వైపే వేళ్లు చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే విజయ్, త్రిష మధ్య బంధాన్ని తెలియజెప్పేలా.. అనేక ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను తవ్వి తీస్తున్నారు. విజయ్, త్రిష పలు సందర్భాల్లో ఒకే చోట సన్నిహితంగా మెలిగినట్లు ఆధారాలు చూపిస్తూ.. డాట్స్ కనెక్ట్ చేసే ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
త్రిష పలు సందర్భాల్లో విజయ్ను ఉద్దేశించి, ఆయన మీద తన ప్రేమను చాటేలా పరోక్షంగా పెట్టిన పోస్టులు.. అలాగే తాను భాగం కాని విజయ్ సినిమాల గురించి ఎగ్జైట్ అవుతూ చేసిన కామెంట్లు.. ఆయా ఈవెంట్లకు హాజరైనప్పటి ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇంకా వీళ్లిద్దరి బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసేలా అనేక పోస్టులు కనిపిస్తున్నాయి. అవి చూస్తే అందరికీ విజయ్, త్రిష మధ్య ఉన్న బంధం ఎలాంటిదో ఈజీగా అర్థమైపోతోంది.
This post was last modified on March 1, 2026 11:35 pm
టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…
భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…
సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…
తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు…
కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…
225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…