ఉస్తాద్ భగత్ సింగ్‌తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది. తాను పెండింగ్‌లో పెట్టిన మూడు సినిమాలను 2024 ఎన్నికల అనంతరం వీలు చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేశాడు పవన్. అంతటితో ఆయన రిలాక్స్ అయిపోతాడనుకున్నారు.
కానీ బ్రేక్ తర్వాత ఇంకో సినిమాను పట్టాలెక్కించడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొన్నేళ్ల ముందు అనౌన్స్ అయిన సురేందర్ రెడ్డి సినిమానే అది. పవన్ మిత్రుడు రామ్ తాళ్ళూరి ఈ చిత్రానికి నిర్మాత. ఈ మధ్యే సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చారు. దీంతో పవన్ అభిమానులు చాలా ఖుషీ అయ్యారు.
సురేందర్ రెడ్డి ఆస్థాన రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి రైటర్. ఇద్దరూ కలిసి ఒక కథను రెడీ చేస్తూ వచ్చారు. ఐతే ఇటీవలే సూరి, వంశీ కలిసి పవన్‌కు స్క్రిప్టు నరేట్ చేయగా.. ఆయన సంతృప్తి చెందలేదని వార్తలు వస్తున్నాయి. దీంతో సూరి, వంశీ స్క్రిప్టు మీద మళ్లీ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐతే పవన్ గత కొన్నేళ్లలో చేసిన సినిమాలను బట్టి చూస్తే.. ఈ మూవీ మీద ఇంత సీరియస్‌గా ఉండడం, శ్రద్ధ పెట్టడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆయన్నుంచి ఎక్కువగా రీమేక్‌లు వచ్చాయి. వాటిలోనూ ‘బ్రో’ చాలా వీక్ అనిపించింది. ఇక ‘హరిహర వీరమల్లు’ సంగతి తెలిసిందే. కానీ సూరి విషయంలో మాత్రం అస్సలు రాజీ పడకపోవడం, స్క్రిప్టు మీద మళ్లీ పని చేయాలని చెప్పడం గురించి కొందరు వ్యంగ్యంగా కూడా స్పందిస్తున్నారు.
కానీ ఇంతకుముందు చేసిన సినిమాల విషయంలో పవన్‌కు ఎక్కువ టైం లేదు. తాను డబ్బుల కోసమే కొన్ని సినిమాలు చేశానని కూడా పవన్ ఓపెన్‌గా చెప్పారు. ఈ క్రమంలోనే తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేయాలని చూశారు. అందుకోసం రీమేక్‌లను ఎంచుకున్నారు. మిగతా సినిమాల స్క్రిప్టు, మేకింగ్ గురించి కూడా ఆయన ఎక్కువ పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు ఆయనకు టైం ఉంది. ఇప్పుడు సినిమా చేస్తున్నది కూడా మిత్ర ధర్మం కోసం. తన కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూసిన మిత్రుడు రామ్ తాళ్ళూరి కోసం పవన్ చేస్తున్న సినిమా ఇది. ఏదో మొక్కుబడిగా లాగించేయాలని పవన్ అనుకోవట్లేదు. జనసేన కోసం కూడా ఎంతో కష్టపడ్డ రామ్‌కు ఒక పెద్ద హిట్‌తో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని పవన్ కోరుకుంటున్నాడు. అందుకే బెస్ట్ స్టోరీతోనే ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడు.
అందుకే ఆషామాషీగా ఆయన స్క్రిప్టును ఓకే చేసేలా లేడన్నది సన్నిహితుల మాట. అంతా అనుకున్నట్లు జరిగితే ఉగాదికి ఈ సినిమాను మొదలుపెట్టాలని అనుకున్నారు. స్క్రిప్టు ఒకే కానీ నేపథ్యంలో ముహూర్తం, రెగ్యులర్ షూటింగ్ ఇంకొంత ఆలస్యం కానున్నాయి. తర్వాతి నరేషన్లో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మేలో చిత్రీకరణ మొదలు కావచ్చు.
This post was last modified on February 20, 2026 3:58 pm
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…