Movie News

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ సినిమా వసూళ్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. తర్వాత తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో విడుదలై అన్ని చోట్లా ఘనవిజయం సాధించింది. విదేశీ భాషల్లో కూడా రీమేక్ అయిన ఈ సినిమాకు తర్వాత సీక్వెల్ వచ్చింది. అది ఓటీటీలో రిలీజై అద్భుత స్పందన తెచ్చుకుంది.

ఇప్పుడీ సినిమాకు రెండో సీక్వెల్ తీస్తున్నారు మోహన్ లాల్, జీతు జోసెఫ్. ఏప్రిల్ 3న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆల్రెడీ ముగిసినట్లుగా కనిపించిన కథను జీతు ఇంకెలా విస్తరించాడు.. ఈసారి ఏం ట్విస్టులు ఇస్తాడు అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కథ గురించి ఇప్పుడో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

తన కూతురిని ఇబ్బంది పెట్టిన కుర్రాడు చనిపోతే జార్జ్ కుట్టి దాన్ని కవర్ చేస్తూ కుటుంబాన్ని రక్షించడానికి ఏం చేశాడనే నేపథ్యంలో దృశ్యం కథ నడిస్తే.. దృశ్యం-2లో ఈ పాత కేసును తవ్విన పోలీసులకు చెక్ పెట్టాడనే కోణంలో సాగుతుంది. ఐతే మూడో పార్ట్‌లో జార్జ్ కుట్టి పాత్రకు సంబంధించి ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంటుందట.

తన కుటుంబానికి కూడా తెలియకుండా దాచి పెట్టిన ఒక విషయం మీద అతను అంతర్మథనానికి గురవడం.. ఆ పరిస్థితుల్లో అతనేం చేశాడనే నేపథ్యంలో దృశ్యం-3 నడుస్తుందట. జార్జ్ కుట్టి దాచిపెట్టిన సీక్రెటే ఈ సినిమాలో హైలైట్ అని సమాచారం.

ఈ సినిమా క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు షాకైపోతారని ఇందులో కీలక పాత్ర పోషించిన ఆశా శరత్ ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఐతే దర్శకుడు జీతు మాత్రం ఇందులో ట్విస్టులకంటే ఫ్యామిలీ డ్రామానే హైలైట్ అని పేర్కొన్నాడు.

మరి ‘దృశ్యం-3’ ప్రేక్షకుల అంచనాలను ఏమేర అందుకుంటుందో చూడాలి. ముందు మలయాళంలో విడుదలయ్యాక.. హిందీ, తెలుగు వెర్షన్లు కొంచెం ఆలస్యంగా రిలీజవుతాయి.

This post was last modified on February 20, 2026 3:03 pm

Share

Recent Posts

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

50 minutes ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

1 hour ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

1 hour ago

త్రివిక్రమ్ బాధ్యత గురించి భేతాళ ప్రశ్న

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…

2 hours ago

రియాలిటీకి దగ్గరగా ఉన్నా కామెంట్స్ తప్పలేదు

నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…

2 hours ago

సరైన పుకారు ఎవరు సృష్టించారు

సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…

3 hours ago