పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇటీవలే విడుదలైన సీత పయనంకు ఆశించిన స్పందన కనిపించడం లేదు. కథలో వైవిధ్యం ఉన్నా ట్రీట్ మెంట్ లో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ ని మెప్పించలేకపోతున్న వైనం వసూళ్లలో బయట పడుతోంది.
నిజానికి దీనికి ముందు అనుకున్న హీరో విశ్వక్ సేన్ అన్న సంగతి తెలిసిందే. దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ తో ఏవో విభేదాలు రావడంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. మీడియా ముందు చిన్నపాటి అల్లరి కూడా అయ్యింది. కొంత గ్యాప్ తీసుకుని అర్జున్ హీరోని మార్చుకుని తాను అనుకున్నట్టే సీత పయనం పూర్తి చేశాడు.
కట్ చేస్తే సీత పయనం రిజల్ట్ చూశాక విశ్వక్ సేన్ ఒక ఫ్లాప్ తప్పించుకున్నాడని ఫ్యాన్స్ ఊరట చెందవచ్చు కానీ ఆ ఆనందం ఫంకీ ఆవిరి చేసింది. ఎందుకంటే ఏడాదికి పైగా విశ్వక్ ఈ ఒక్క సినిమా మీదే గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. దర్శకుడు అనుదీప్ తనలో ఫన్ యాంగిల్ బయటికి తీసి బ్లాక్ బస్టర్ ఇస్తాడనే నమ్మకంతో బయట కూడా కనిపించకుండా దానికే అంకితమైపోయాడు.
తీరా చూస్తే ఫంకీ కూడా సీత పయనం లాగా ఎదురీదుతోంది. ఒక వివాదం వల్ల విడిపోయిన అర్జున్, విశ్వక్ సేన్ పరస్పరం బాక్సాఫీస్ దగ్గర తలపడితే ఎవరూ విజేత కాకపోవడం ఫైనల్ ట్విస్ట్. ఇంకా చెప్పాలంటే ఇద్దరూ దొరికిపోయారు.
ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం వల్ల ఇలా జరిగిందని అనుకోవడానికి లేదు. అది కేవలం ఒక సమర్ధింపు కోసం చెప్పుకునే సాకు మాత్రమే. అన్ని వర్గాలను మెప్పిస్తే జనం ఆదరిస్తారని గతంలో ఎన్నోసార్లు రుజువయ్యింది. కాకపోతే విశ్వక్ సేన్, అర్జున్ లో ఎవరికో ఒకరికి సూపర్ హిట్ దక్కి ఉంటే బాగుండేది కానీ అలా జరగకపోవడం నిరాశ కలిగించే విషయమే.
రాబోయే వీకెండ్ ఏమైనా పికప్ చూపిస్తే వసూళ్ల పరంగా కొంచెం నెంబర్లు చూడొచ్చు కానీ ఇప్పటికైతే జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. ఒకవేళ విశ్వక్ కనక సీత పయనం చేసి ఉంటే ఓపెనింగ్స్ పరంగా కొంచెం హెల్ప్ అయ్యేది కానీ అలా జరగకపోవడం బ్యాడ్ లక్కే.
This post was last modified on February 16, 2026 10:38 pm
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…