కలిసి సినిమా చేయని ఒక హీరో, హీరోయిన్ కలిసి తరచుగా కనిపిస్తే.. వాళ్ల మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైపోతుంది. ఇటీవల తమిళ నటుడు ధనుష్, బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్‌ల గురించి ఇలాగే అందరిలోనూ సందేహాలు రేకెత్తించారు. ధనుష్‌కు ఆల్రెడీ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యతో పెళ్లయింది. వాళ్లిద్దరూ కొన్నేళ్ల ముందు విడిపోయారు.
మృణాల్‌కు గతంలో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతడితో బ్రేకప్ అయింది. ఈ మధ్య ఇద్దరి మధ్య బంధం మందలైందని.. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. గత ఏడాది మృణాల్ నటించిన ‘సన్నాఫ్ సర్దార్-2’ సినిమాకు ముంబయిలో ప్రిమియర్ వేయగా.. దానికి ధనుష్ హాజరవడం, ఇద్దరూ చాలా సన్నిహితంగా మెలగడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఐతే ఇప్పటికే తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన మృణాల్.. తాజాగా తమిళ క్రిటిక్ భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూలో మరోసారి ఈ టాపిక్ మీద స్పందించింది. తన కొత్త లవ్ స్టోరీ గురించి ఎవరు ఎలా ప్రచారం మొదలుపెట్టారో కానీ.. ఆ వార్తలను చూస్తే తనకు నవ్వు వస్తోందని మృణాల్ ఠాకూర్ తెలిపింది.
ఫిబ్రవరి 14న మామూలుగా వేలంటైన్స్ డే జరుపుకుంటారని.. కానీ ఈసారి ఏప్రిల్ 1, ఫూల్స్ డే ముందే వస్తుందని.. తన పెళ్లి గురించి మాట్లాడుతున్న వారందరూ ఆ రోజు ఫూల్స్ డే చేసుకోవచ్చిన ఆమె వ్యంగ్యంగా స్పందించింది.
పెళ్ళి గురించి ఎవరు ఎలా వార్తలు సృష్టించారో తెలియదని.. కానీ ఇది పూర్తి అబద్ధమని ఆమె స్పష్టం చేసింది. ఇప్పటిదాకా తమిళంలో నటించని మృణాల్.. త్వరలోనే శింబు సరసన ఓ సినిమాలో కథానాయికగా నటించనుంది. తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ చిత్రంలో నటించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates