Movie News

రెమ్యునరేషన్ చిక్కుల్లో అజిత్ మూవీ!

తమిళ చిత్రసీమలో అజిత్ కుమార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా వచ్చిన ‘గుడ్ బాడ్ అగ్లీ’ సినిమా అజిత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి సుమారు 250 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అదే జోష్‌లో దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో మరో సినిమాను పట్టాలెక్కిస్తారని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ చుట్టూ ఆర్థిక పరమైన చిక్కులు మొదలయ్యాయనే వార్త కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది.

సాధారణంగా ఒక సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే నిర్మాతలు క్యూ కడుతుంటారు. కానీ అజిత్  అధిక్ సినిమా విషయంలో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో ఉండటం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అజిత్ డిమాండ్ చేస్తున్న భారీ రెమ్యునరేషన్ భరించలేక మేకర్స్ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన లెక్కలు ఏమాత్రం కుదరకపోవడమే దీనికి ప్రధాన కారణమని సమాచారం.

ఈ సినిమా కోసం అజిత్ దాదాపు 160 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కోట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కేవలం హీరో పారితోషికమే ఈ స్థాయిలో ఉంటే, సినిమా మొత్తం బడ్జెట్ 300 కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది. ఒకవేళ సినిమాకు ‘గుడ్ బాడ్ అగ్లీ’ రేంజ్ వసూళ్లు వచ్చినా, థియేట్రికల్ షేర్ ద్వారా బడ్జెట్ లో 40 శాతం కూడా రికవరీ అవ్వడం కష్టమని నిర్మాతలు లెక్కలు వేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆర్థికంగా లాభదాయకం కాదని భావించి పలువురు తమిళ, తెలుగు నిర్మాతలు తప్పుకున్నట్లు తెలుస్తోంది.

సినిమా మార్కెట్ లెక్కల ప్రకారం.. బడ్జెట్ 200 కోట్ల లోపు ఉంటేనే వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ అజిత్ పారితోషికం వల్లే బడ్జెట్ కొండలా పెరిగిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో OTT ప్లాట్‌ఫారమ్‌లు కూడా గతంలో లాగా భారీ డీల్స్ ఇవ్వడం లేదు. మిగిలిన 60 శాతం రికవరీ కోసం నాన్ థియేట్రికల్ రైట్స్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది, అది ఇప్పుడు అంత ఈజీ కాదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అందుకే ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదని టాక్. అజిత్ ప్రస్తుతం తన రేసింగ్ కెరీర్ పై ఫోకస్ పెట్టారు. అది పూర్తయ్యాకే సినిమా సెట్స్ లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో బడ్జెట్ సమస్యలు సెటిల్ అయితే తప్ప షూటింగ్ మొదలవ్వడం కష్టమే. అజిత్ తన రెమ్యునరేషన్ విషయంలో కాస్త తగ్గుతారా లేక మేకర్స్ రిస్క్ చేసి ముందుకు వెళ్తారా అనేది చూడాలి.

This post was last modified on February 11, 2026 10:52 am

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

2 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

3 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

13 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago