ఒక్కోసారి అమీర్ ఖాన్ ఏదేదో స్టేట్ మెంట్లు ఇచ్చేసి గందరగోళంలో పడేస్తారు. కొన్ని పనులు కూడా అలాగే అనిపించినా వాటి ఫలితాలు పాజిటివ్ గా రావడం ట్విస్టు. ఆ మధ్య సితారే జమీన్ పర్ ని ఓటిటికి అమ్మకుండా యుట్యూబ్ లో పే పర్ వ్యూ విధానంలో పెట్టడం ద్వారా సెన్సేషన్ సృష్టించిన అమీర్ దాని వల్ల భారీ ఆదాయం పొందకపోయినా ఒక కొత్త రూట్ అయితే చూపించాడు.
కాకపోతే మిగిలిన వాళ్ళు ఎవరూ దాన్ని ఫాలో కావడం లేదు. తాజాగా దురంధర్ గురించి చేసిన కామెంట్స్ మూవీ లవర్స్ లో టాపిక్ గా మారాయి. 5 వేల స్క్రీన్లకే వెయ్యి కోట్లు వసూలు చేస్తే 15 వేల స్క్రీన్లు ఉంటే ఇంకెంత వచ్చేదోనని అన్నారు.
అంటే ఆయన ఉద్దేశం ఇండియాలో ఇబ్బడిముబ్బడిగా థియేటర్లను పెంచేయాలి. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇందులో ఎంత డొల్లతనం ఉందో అర్థం చేసుకోవచ్చు. జపాన్, చైనాలాగా మన దేశంలో వేల స్క్రీన్లను పెంచే అవకాశాలు లేవు. ఎందుకంటే స్థలాల ధరలు, పర్మిషన్లు, కోట్లకు పెరిగిపోయిన నిర్మాణ వ్యయం, అనుమతులు, లంచాలు ఇలా ఎన్నో వ్యవస్థలను దాటుకోవాల్సి ఉంటుంది.
పైగా ఓటిటి, పైరసీ పెట్రేగిపోయాక థియేటర్లకు వచ్చే జనాలు తగ్గిపోయారు. వేల సింగల్ స్క్రీన్లు మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులుగా మారిపోయాయి. మరికొన్ని ఇదే దారిలో ఉన్నాయి. కారణం ఒకటే.. మైంటైన్ చేయలేక యజమానులు అమ్మేసుకుంటున్నారు.
సక్సెస్ శాతం పది శాతం కూడా లేని పరిశ్రమలో ఇలా స్క్రీన్లు పెంచుకుంటూ పోతే నష్టాలు వస్తాయి. అందుకే అమీర్ వాదన చెల్లదు. ఆల్రెడీ కార్పొరేట్ మల్టీప్లెక్సుల డామినేషన్ విపరీతంగా పెరిగిపోయింది. వంద రూపాయల టికెట్లు ఉన్న స్క్రీన్లు ఇండియా మొత్తం మీద వేల నుంచి వందల సంఖ్యలోకి దిగుతున్నాయి.
కనీసం రెండు వందల నుంచి అయిదు వందల రూపాయలు పెట్టనిదే సినిమాలు చూడలేని పరిస్థితి ఆల్రెడీ ఉంది. ఇది మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు. అమీర్ ఇవన్నీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే బాగుండేది. అయినా సింగల్ స్క్రీన్ వ్యవస్థ కుప్పకూలినప్పుడు సైలెంట్ గా ఉండి ఇప్పుడు గొంతెత్తితే ఏం లాభం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
