రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ దేవరకొండని సక్సెస్ వరించడానికి టైం అయితే పట్టింది. బేబీ రూపంలో తొలి బ్లాక్ బస్టర్ దక్కాక మళ్ళీ అలాంటి ఫలితం రిపీట్ కాకపోవడంతో కొంచెం బ్రేక్ తీసుకున్నాడు. ప్రస్తుతం సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
మొదటిది ఎపిక్. ఆల్రెడీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ కం యూత్ డ్రామా త్వరలోనే విడుదల కానుంది. మరొకటి తక్షకుడు. ఆనంద్ తోనే మిడిల్ క్లాస్ మెలోడీస్ తీసిన వినోద్ అనతోజు దర్శకత్వం వహించాడు.
టీజర్ ఆసక్తికరంగా అనిపించింది. ఎక్కడో అడవుల్లో స్పృహ లేని స్థితిలో నుంచి బయటికి వచ్చిన ఒక యువకుడు ప్రతీకారం కోసం వేట మొదలుపెడతాడు. శత్రువు తన చుట్టుపక్కలే ఉన్నాడని తెలిసినా ఎవరో కనుక్కోలేని విచిత్రమైన పరిస్థితి తలెత్తుతుంది.
అసలు అతనీ దారుణమైన స్థితికి రావడానికి కారణమైన వాళ్ళు ఎవరు, ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు ఏమయ్యిందనే పాయింట్ మీద తక్షకుడు రూపొందినట్టు కనిపిస్తోంది. విజువల్స్ అన్నీ హై ఎండ్ ఇంటెన్స్ యాక్షన్ మోడ్ లో సాగాయి. ఎక్కడ ఎంటర్ టైన్మెంట్ ఊసే లేకుండా ఫుల్ సీరియస్ నెరేషన్ లో వెళ్ళిపోయాడు దర్శకుడు వినోద్.
చూస్తుంటే అన్న రూటులోనే తమ్ముడు నడుస్తున్నట్టుంది. విజయ్ ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్ధన రెండూ ఇంటెన్స్ డ్రామాలే చేస్తున్నాడు. ఇప్పుడు ఆనంద్ కూడా అదే జానర్ ట్రై చేస్తున్నాడు. కాకపోతే తక్షకుడు ఎక్స్ క్లూజివ్ గా నెట్ ఫ్లిక్స్ కోసం తీసిన ఓటిటి మూవీ.
టీజర్ చూస్తే థియేటర్ లో ఆడే కెపాసిటీ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది కానీ ముందస్తు చేసుకున్న అగ్రిమెంట్ కావడం వల్ల బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం లేకపోవచ్చు. ఎపిక్, తక్షకుడు రెండూ ఈ ఏడాదిలోనే రిలీజ్ కాబోతున్నాయి. క్లిక్ అయితే మాత్రం ఆనంద్ దేవరకొండకు పెద్ద ప్రమోషన్ దొరికినట్టు అవుతుంది. చూడాలి ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates