1997లో విడుదలైన బోర్డర్ ప్రభంజనాన్ని అప్పట్లో చూసినవాళ్లు అంత సులభంగా మర్చిపోలేరు. పాకిస్థాన్ తో యుద్ధ నేపధ్యాన్ని దర్శకడు జెపి దత్తా ఆవిష్కరించిన తీరు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. భారీ బడ్జెట్ తో మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇతర బాషల డబ్బింగ్ లేకపోయినా, కేవలం హిందీ వెర్షన్ తోనే దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామి సృష్టించింది.
అలాంటి క్లాసిక్ మూవీకి ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కొనసాగింపంటే ఖచ్చితంగా మూవీ లవర్స్ లో ఆసక్తి రేగుతుంది. దర్శకత్వ బాధ్యతలు ఈసారి అనురాగ్ సింగ్ చేపట్టడంతో కంటెంట్ పట్ల సందేహపడుతున్న వాళ్ళు లేకపోలేదు. ఇక అసలు మ్యాటర్ చూద్దాం.
బోర్డర్ 2 మొత్తం మూడు గంటల ఇరవై నిమిషాల నిడివితో రూపొందింది. ఫస్ట్ పార్ట్ లాగే ఇందులో కూడా 1971లో జరిగిన ఇండియా పాకిస్థాన్ యుద్ధం నేపధ్యాన్ని తీసుకున్నారు. భారతదేశం మీద ముప్పేట దాడి చేసే ఉద్దేశంతో గుజరాత్, పంజాబ్,కాశ్మీర్ తదితర సరిహద్దు ప్రాంతాల వెంబడి దాడులు ప్లాన్ చేసిన శత్రుదేశం పన్నాగాన్ని ప్రభుత్వం పసిగడుతుంది.
వాటిని ధీటుగా ఎదురుకునేందుకు త్రివిధ దళాలను ఏర్పాటు చేస్తుంది. లెఫ్టినెంట్ ఫతే సింగ్ (సన్నీ డియోల్) ఆధ్వర్యంలో ఏర్పాటైన యువ సైనికుల బృందం ప్రాణాలకు తెగించి ముష్కరులను ఎలా తుదముట్టించారు, ఎలా యుద్ధంలో గెలిచారనేది బోర్డర్ 2 అసలు కథ.
స్టోరీ చూసుకుంటే బోర్డర్ 2లో మరీ కొత్త కంటెంట్ లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం అధిక శాతం ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఇవ్వడంతో గంటన్నర పాటు విపరీతమైన సాగతీత ఉంటుంద్. వరుణ్ ధావన్, దిల్జిత్, ఆహాన్ శెట్టిల కుటుంబాలు, స్నేహాలు, శిక్షణ వగైరాల మీద ఎక్కువ సమయం గడిచిపోతుంది.
సెకండాఫ్ లో అసలైన వార్ డ్రామా మొదలవుతుంది. అయితే వీటిని ముందే ఆస్వాదించడానికి ప్రిపేర్ అయితే తప్ప కనెక్ట్ కావడం కష్టం. ముఖ్యంగా బోర్డర్ ఫ్యాన్స్ కి మొదటి భాగం అంత గొప్పగా సీక్వెల్ అనిపించదు. అయినా సరే సన్నీ డియోల్ పెర్ఫార్మన్స్ కోసం, పవర్ ఫుల్ డైలాగుల కోసం ట్రై చేయొచ్చు. విఎఫెక్స్ క్వాలీటీ మాత్రం సంతృప్తికరంగా లేదు. రెస్పాన్స్ చూస్తుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో బోర్డర్ 2 వర్కౌట్ అయ్యేలానే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates