దర్శకుడు సురేందర్ రెడ్డి చివరి చిత్రం ‘ఏజెంట్’ ఒక పెద్ద డిజాస్టర్. అంతకుముందు ‘సైరా’ రూపంలో అతను మంచి సినిమానే తీసినా.. అది ఆశించిన విజయం సాధించలేదు. ఆ సినిమా క్రెడిట్ అతడికి పెద్దగా దక్కలేదు కూడా. దాని కంటే ముందు అతను రూపొందించిన ‘కిక్-2’ పెద్ద డిజాస్టర్ అయింది.
ఇక రచయిత-దర్శకుడు వక్కంతం వంశీ విషయానికి వస్తే.. ఏజెంట్, కిక్-2 చిత్రాలకు అతనే కథకుడు. మధ్యలో అతను దర్శకుడిగానూ మారాడు. నా పేరు సూర్య, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు తీశాడు. అవి రెండూ ఒకదాన్నిమించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి.
ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీలకు మామూలుగా మిడ్ రేంజ్ హీరోలు దొరకడం కూడా కష్టమే. అలాంటిది ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం రావడం అంటే చిన్న విషయం కాదు.
పవన్‌తో సురేందర్ సినిమా ఎప్పుడో ప్రకటించినప్పటికీ.. ఒక దశలో అది క్యాన్సిల్ అయిందనే అంతా అనుకున్నారు. కానీ తన కమిట్మెంట్‌ను నిలబెట్టుకుంటూ పవన్ ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. కెరీర్లో ఈ దశలో సూరి, వంశీలకు ఇది గొప్ప అవకాశమే. ఇద్దరికీ కెరీర్లో పుంజుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ ఇంకోటి రాదు. దీన్ని వృథా చేసుకుంటే వాళ్లిద్దరి కెరీర్లుకు గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే. ఇంకో పెద్ద అవకాశం రావడం కష్టమే అవుతుంది.
కాబట్టి ‘కిక్-2’, ‘ఏజెంట్’ సినిమాల్లాగా ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా.. పవన్ ఇమేజ్‌కు సూటయ్యే మంచి స్క్రిప్టుతో రంగంలోకి దిగి.. సినిమాను బాగా తీర్చిదిద్ది అభిమానుల అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత సూరి-వంశీల మీద ఉంది. పవన్ కోసం వాళ్లిద్దరూ కలిసి రెండు కథలు రెడీ చేశారట. అందులో దేన్ని సినిమాగా తీయబోతున్నారో ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. త్వరలోనే కథను ఫైనలైజ్ చేస్తారట. వేసవిలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లొచ్చని తెలుస్తోంది. పవన్ మిత్రుడే అయిన రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడు.
This post was last modified on January 2, 2026 7:31 am
టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా కొనసాగుతున్నాడు ప్రభాస్. కానీ ఎంతకీ తన పెళ్లి కావడం లేదు.…
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నుంచి ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘ఎల్-2: ఎంపురాన్’ డివైడ్ టాక్ తెచ్చుకుని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు మొదలైనపుడు, ఫస్ట్ టీజర్ రిలీజైనపుడు దానిపై అంచనాలు మామూలుగా లేవు.…
మహిళల వస్త్రధారణ గురించి సీనియర్ నటుడు శివాజీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఆయన్ని తీవ్రంగా…
కన్నవారే కసాయిలా మారి తమ పిల్లల ప్రాణాలు తీస్తున్న దారుణ ఘటనలు సమాజాన్ని కలచివేస్తున్నాయి. ఒక చోట తల్లి పిల్లలకు…
సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న పోలీస్ అధికారుల్లో సజ్జనార్ ఒకరు. యువత ఆయనకు బాగా కనెక్ట్ అవుతారు. ఓవైపు…