కొన్ని సినిమాలు విడుదలకు ముందు నిర్మాతల్లో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ చూపిస్తాయి. గ్యారెంటీ హిట్టు కొడతామనే నమ్మకాన్ని బయట పెడతాయి. తీరా థియేటర్లోకి వచ్చాక జనాల తీర్పు ఇంకోలా ఉంటుంది. దీంతో షాకవ్వడం ప్రొడ్యూసర్ల వంతవుతుంది. కింగ్డమ్ ఆ కోవలోకే వస్తుంది.
షూటింగ్ జరుగుతున్న టైంలో విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. ఒకటి కాదు ఏకంగా రెండు భాగాల స్థాయిలో ఆడుతుందని నిర్మాత అనుకున్నారు. కానీ జరిగింది వేరు. ఏదేదో ఊహించుకున్న ఆడియన్స్ నిరాశ చెందారు. మా ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన క్లారిటీ నాగవంశీ ఇచ్చారు.
కింగ్డమ్ సెకండాఫ్ లో సత్యదేవ్ పాత్ర చనిపోతున్నప్పుడు విజయ్ దేవరకొండ నుంచి ఎలాంటి ప్రతిఘటించే ప్రయత్నం లేకుండా భాగ్యశ్రీ బోర్సే దగ్గర ఉండటం ఇంపాక్ట్ ని దెబ్బ కొట్టింది.
ఒకవేళ అలా కాకుండా అనుకోకుండా మత్తులోనో, ప్రమాదంలోనో ఉన్నట్టు చూపిస్తే కన్విన్సింగ్ గా ఉండేదేమో కానీ అలా చేయకుండా కొత్తగా చెప్పాలనే ఉద్దేశంతో స్క్రీన్ ప్లేని రాసుకోవడంతో హీరో ఔచిత్యం దెబ్బ తిని ఆ ఎపిసోడ్ టోటల్ గా మైనస్ అయిపోయింది. ఇలాంటి వాటి గురించి చినబాబుతో పాటు నాగవంశీ మూడు నెలల పాటు దర్శకుడు గౌతమ్ తిన్ననూరిని ఒప్పించే ప్రయత్నం చేశారట కానీ కుదరకపోవడంతో వదిలేశారు.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మరొకటి ఉంది. స్క్రిప్ట్ స్టేజిలో ఏదైతే వర్కౌట్ అవుతుందని నమ్ముతామో అది తెరమీద కన్వర్ట్ అయ్యే క్రమంలో అదే అవుట్ ఫుట్ వస్తుందన్న గ్యారెంటీ లేదు. మాస్ జాతరలో రాజేంద్ర ప్రసాద్ – శ్రీలీల మధ్య కామెడీని దర్శకుడు చెబుతున్నప్పుడు బాగా ఎంజాయ్ చేసిన నాగవంశీ రియాలిటీలో జనం దాన్ని ఆదరించకపోవడం చూసి ఆశ్చర్యపోయారు.
కొన్ని గుర్తించలేని పొరపాట్లు ఫలితాన్ని శాశిస్తాయి. ఇవన్నీ ఆయన వివరించినవే అయినా అందరూ ఆలోచించాల్సిన విషయాలే. ప్రేక్షకుల బాగా అప్డేట్ గా ఉంటున్న ట్రెండ్ లో కేవలం రెండు మూడు బ్లాక్స్ తో హిట్లు సాధించలేమనేది నగ్న సత్యం.
Gulte Telugu Telugu Political and Movie News Updates