హాట్‍ ఫోటో: అక్కా చెల్లెలు అచ్చు గుద్దేసారు!

టాలెంటెడ్‍ బాలీవుడ్‍ బ్యూటీ భూమి పేడ్నేకర్‍కి ట్విన్‍ సిస్టర్‍ వుందనే సంగతి చాలా మందికి తెలియదు. సమీక్ష పేడ్నేకర్‍ కూడా అచ్చం అక్క పోలికలతోనే వున్నా కానీ తాను సినిమా రంగాన్ని ఎంచుకోలేదు. ఆమె లా చదివి లాయర్‍గా రాణిస్తోంది. అయితే అందచందాల విషయంలో అక్కకు తీసిపోదు కనుక ఆమెను కూడా ఫోటో షూట్లకు ఆహ్వానిస్తున్నారు. ట్విన్‍ సిస్టర్స్ అచ్చు గుద్దినట్టు ఒకేలా వుండడం,

అందులో ఒకరు పేరొందిన తార కావడం కంటే ఫోటోగ్రాఫర్లకు, ఫ్యాషన్‍ మ్యాగజైన్లకు ఆకర్షణీయమైన కాన్సెప్ట్ ఏముంటుంది? సమీక్షను కన్విన్స్ చేసి భూమితో కలిసి ఏదైనా సినిమాలో నటించేలా చేయడానికి ఎవరైనా నిర్మాత కానీ, దర్శకుడు కానీ నడుం కడతాడేమో చూడాలి. డ్యూయల్‍ రోల్స్ మీద అమితాసక్తి వున్న చిత్ర పరిశ్రమలో ఇలాంటి అరుదైన అవకాశాన్ని ఇంతవరకు వినియోగించుకోక పోవడం విచిత్రమే సుమీ.