వరసగా హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసేసి పూర్తిగా రాజకీయాలకు పరిమితమవుతారనుకున్న ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడప్పుడే అంత కఠిన నిర్ణయం తీసుకునేలా లేరు. నిర్మాత రామ్ తాళ్ళూరి – దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కాల్సిన సినిమా మళ్ళీ కార్యరూపం దాలుస్తోందనే ప్రచారం ఆల్రెడీ చక్కర్లు కొడుతుండగా, తాజాగా కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత పవన్ ని పర్సనల్ గా కలుసుకోవడం కొత్త చర్చకు తీస్తోంది. చిరంజీవి, యష్, విజయ్, ధృవ్ సర్జా లాంటి స్టార్లతో ఆల్రెడీ వందల కోట్ల ప్రాజెక్టులు సెట్స్ మీద ఉంచిన ఈ నిర్మాణ సంస్థ పవన్ తో టైఅప్ కావడం ఆశ్చర్యం కలిగించదు.
ఇన్ సైడ్ టాక్ కథనాల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. పవన్ త్వరలో కెవిఎన్ తో మూవీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కానీ ముందు దర్శకుడెవరో ఫైనల్ కావాలి. మొదటి పేరు హెచ్ వినోత్ అని వినిపిస్తోంది. ప్రస్తుతం ఇతను ఇదే బ్యానర్ లో విజయ్ జన నాయకుడు తీస్తున్నాడు. వకీల్ సాబ్ కన్నా ముందు దాని తమిళ వర్షన్ నీర్కొండ పార్వైని తీసింది తనే. వేణు శ్రీరామ్ ఒరిజినల్ పింక్ బదులు దీన్నే రిఫరెన్స్ గా తీసుకున్నారు. సో పవన్ కు వినోత్ దర్శకత్వం మీద అవగాహన ఉంది. రెండో పేరు లోకేష్ కనగరాజ్. అయితే తన దగ్గర కథ సిద్ధంగా లేదట. ఇక్కడ మరో మలుపు కూడా ఉంది.
ఒక రచయిత రాజా ది గ్రేట్ తరహాలో బ్లైండ్ హీరో క్యారెక్టరైజేషన్ తో ఒక మంచి సబ్జెక్టు తయారు చేశాడట. ఒక పెద్ద హీరోతో డైరెక్షన్ డెబ్యూ చేయాలనేది అతని టార్గెట్. కానీ అనుభవం లేని తన మీద అంత బడ్జెట్ పెట్టేందుకు నిర్మాణ సంస్థ సిద్ధంగా లేదు. దీంతో భారీ మొత్తానికి ఆ కథను కనక అతను ఇచ్చే పనైతే పవన్ – వినోత్ కాంబోలో తెరకెక్కించాలని చూస్తున్నారట. బయట స్టోరీలను లోకేష్ ఒప్పుకోడు కాబట్టి మొదటి కాంబోకే ఎక్కువ ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాల స్టేజిలోనే ఉన్నాయి కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే దాకా వేచి చూడాలి. ఫ్యాన్స్ మాత్రం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates