ఎన్నో ఏళ్ల కిందటే క్లోజ్ అయిపోయినట్లుగా కనిపించిన త్రిష కెరీర్.. మధ్యలో భలేగా పుంజుకుంది. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఒక దశలో వరుణ్ మణియన్ అనే నిర్మాతతో ఆమె పెళ్లికి సిద్ధపడడం గుర్తుండే ఉంటుంది. కానీ 2016లో జరిగిన వీరి నిశ్చితార్థం తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. ఆపై త్రిష మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలు చేస్తూ ఇప్పటికీ టాప్ రేంజిలో కొనసాగుతోంది త్రిష. ఈ ఏడాది అజిత్ సరసన విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్‌కు జోడీగా థగ్ లైఫ్ సినిమాల్లో కనిపించింది త్రిష.
ఐతే కెరీర్ ఇప్పటికీ మంచి ఊపులోనే ఉండగా.. త్రిష పెళ్లి గురించి మళ్లీ ఇటీవల వార్తలు మొదలయ్యాయి. 42 ఏళ్ల త్రిష.. ఛండీగఢ్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందని.. త్వరలోనే వీరి ఎంగేజ్మెంట్ జరగబోతోందని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. కొన్ని నేషనల్ మీడియా సంస్థల్లో కూడా ఈ వార్త హల్‌చల్ చేసింది. ఐతే ఈ ప్రచారానికి త్రిష తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టింది.
తన కోసం తన జీవితాన్ని చక్కగా ప్లాన్ చేస్తున్న వాళ్లంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్న త్రిష.. వాళ్లంతా తన హనీమూన్ షెడ్యూల్ కూడా ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నట్లు వ్యాఖ్యానించింది. తన పెళ్లి గురించి వార్తలు రాస్తున్న, ప్రచారం చేస్తున్న వాళ్లందరికీ త్రిష వ్యంగ్యంగా ఇచ్చిన కౌంటర్ ఇదనడంలో సందేహం లేదు. అంటే త్రిష పెళ్లి గురించి ఇప్పుడు జరుగుతున్న ప్రచారమంతా నిజం కాదని స్పష్టమైపోయింది.
ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన కరుప్పు సినిమాలో నటిస్తున్న త్రిష.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా విశ్వంభరలో చేస్తోంది. కరుప్పు ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశముంది.. విశ్వంభర వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. 42 ఏళ్ల వయసులోనూ ఇలాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో కథానాయికగా చేయడం త్రిషకే చెల్లింది. ఆమె ఊపు చూస్తుంటే ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates