నాని మూవీలో సలార్ విలన్ ?

మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ తో మనకు పరిచయం బాగా పెరిగింది సలార్ తోనే. అందులో ప్రభాస్ స్నేహితుడిగా, విలన్ గా నటించి మెప్పించిన ఈ విలక్షణ నటుడు గత ఏడాది దర్శకుడిగా ఎల్2 ఎంపురాన్ తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 చేస్తున్న పృథ్విరాజ్ ఇతర భాషల్లో నటించాలంటే కేవలం రెమ్యునరేషన్ ఒకటే చూసుకోడు. తన పాత్ర ప్రాధాన్యం, పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఇవన్నీ చెక్ చేసుకుంటాడు. తాజాగా మరో టాలీవుడ్ ప్యాన్ ఇండియా మూవీలో నటించే అవకాశం ఉన్నట్టు మల్లువుడ్ రిపోర్ట్.

ఓజి దర్శకుడు సుజిత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ న్యాచురల్ స్టార్ నానితో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి బ్లడీ రోమియో టైటిల్ పరిశీలనలో ఉంది. స్క్రిప్ట్ వర్క్ ని వేగవంతం చేయబోతున్న సుజిత్ అటు నాని ప్యారడైజ్ పూర్తి చేసుకుని వచ్చేలోపు ఫైనల్ వెర్షన్ వినిపించేందుకు రెడీ కాబోతున్నాడు. ఒకవేళ ఆలస్యమైన పక్షంలో ఓజి 2 పనులు మొదలుపెట్టొచ్చు. అయితే బ్లడీ రోమియో రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కాదు. ఒక డిఫరెంట్ టోన్ ని సుజిత్ ట్రై చేస్తున్నాడు. వయొలెన్స్, యాక్షన్ పెడుతూనే ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులకు ఎదురు కానీ ఒక సరికొత్త అనుభూతిని ఈ మూవీ ద్వారా ప్లాన్ చేస్తున్నాడట.

ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. సాహో ట్రైలర్ వచ్చినప్పుడే పృథ్విరాజ్ సుకుమారన్ ప్రత్యేకంగా సుజిత్ కి ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నాడు. ఇలాంటి వరల్డ్ ఎలా సృష్టించావంటూ కితాబిచ్చాడు. తర్వాత సినిమా చూసి ఫలితంతో సంబంధం లేకుండా ఫిదా కావడం వేరే విషయం. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య బాండింగ్ ఉంది. ఒకవేళ నిజంగా సుజిత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ని డిజైన్ చేసుకుని పృథ్విరాజ్ ని అడిగితే నో అనకపోవచ్చు. కాకపోతే అఫీషియల్ అయ్యేదాకా ఏదీ చెప్పలేం. ప్రస్తుతం ఓజి మేనియా ఎంజాయ్ చేస్తున్న సుజిత్ థియేటర్ రన్ అయ్యాక ఓ రెండు మూడు నెలలు బ్రేక్ తీసుకోబోతున్నాడు.