సోషల్ మీడియా, ఆన్ లైన్, అఫ్ లైన్ ఎక్కడ చూసినా ఓజి జపం తప్ప వేరేది కనిపించడం లేదు. థియేటర్ల దగ్గర సాయంత్రం నుంచే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. మతాబులు, టపాసులు, డీజేలు, బ్యాండ్ మేళాలు, ఆటో కార్ల ర్యాలీలు, నిలువెత్తు కటవుట్లు, వాటికి పూల దండలు, ఫ్లెక్సీ బ్యానర్లు ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి చోట పండగ వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్ లాంటి నగరాల సంగతి చెప్పనక్కర్లేదు. ఒక్క ట్విన్ సిటీస్ లోనే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇరవై కోట్ల దాకా వసూలైనట్టు ట్రేడ్ రిపోర్ట్. ఇప్పటిదాకా హయ్యెస్ట్ రికార్డు సొంతం చేసుకున్న పుష్ప 2, కల్కిని దాటేసిందని సమాచారం.
ఇక వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్ అప్పుడే వంద కోట్లకు చేరువ కావడం మరో సెన్సేషన్. సుజిత్ తీసిందే రెండు సినిమాలు. అందులో సాహో సూపర్ ఫ్లాప్. తర్వాత ఏళ్ళ తరబడి పవన్ కళ్యాణ్ కోసమే కష్టపడ్డాడు. పోనీ హీరోయిన్ ప్రియాంకా మోహన్ కు క్రేజ్ ఉందా అంటే అదీ లేదు. కేవలం పవర్ స్టార్ బ్రాండ్ మీద ఇంత హైప్ వచ్చింది. చాలా కాలం తర్వాత పవన్ ఊరమాస్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ మాములుగా లేదు. ముందే బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయి దానికి తగ్గట్టు విపరీతమైన ఖర్చుతో టికెట్లు, టి షర్టులు, హుడీలు, బ్యాండ్లు ఇలా ఎన్నెన్నో కొనేసుకున్నారు.
ఇవాళ అర్ధరాత్రి వరకు సినిమాలు చూసే అలవాటున్న ప్రతి తెలుగు వాళ్ళు ఓజి షోకు వెళ్లడమో, లేదా టాక్ తెలుసుకోవడం కోసం ట్విట్టర్, ఇన్స్ టాలో ఉండటమో చేస్తారు. ఎన్నో సంవత్సరాల తర్వాత పవన్ సినిమాకు ఇంత వైబ్ కనిపిస్తోంది. అజ్ఞాతవాసి గాయం తర్వాత వరసగా రీమేకులు చేయడం, అవన్నీ యావరేజ్ కావడం, హరిహర వీరమల్లు దారుణ ఫలితాన్ని అందుకోవడం ఇవన్నీ అభిమానులను కలవరపరిచాయి. అందుకే వాళ్ళ ప్రేమంతా ఓజి కోసం దాచుకుని ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాహుబలి నుంచి పుష్ప 2 దాకా ఏఏ రికార్డులు ఎగిరిపోతాయో లెట్ వెయిట్ అండ్ సీ.
Gulte Telugu Telugu Political and Movie News Updates