పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరి చిత్రం ‘హరిహర వీరమల్లు’కు థియేట్రికల్ హక్కుల విషయంలో నిర్మాత చెప్పిన రేట్లకు, బయ్యర్లు అడిగిన ధరలకు అసలు పొంతనే లేదు. చివరికి బయ్యర్ల మాటే నెగ్గి వాళ్లు కోట్ చేసిన రేట్లకే సినిమాను ఇవ్వాల్సి వచ్చింది. చివరికి చూస్తే వాళ్లు దక్కించుకున్న తక్కువ రేట్లకు కూడా సినిమా గిట్టుబాటు చేయలేకపోయింది. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ 40 శాతానికి తక్కువ కాకుండా నష్టాలు తప్పలేదు. కానీ ఇంకో రెండు నెలల తర్వాత రిలీజవుతున్న ‘ఓజీ’ విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమాను బయ్యర్లు ఫ్యాన్సీ రేట్లు పెట్టి కొన్నారు.
‘హరిహర వీరమల్లు’తో పోలిస్తే 70-80 శాతం మేర అధికంగా దీనికి బిజినెస్ జరగడం విశేషం. అయినా సరే బయ్యర్లకు రిస్కేమీ కనిపించడం లేదు. సినిమాకు టాక్ ఎలా ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెన్ అయిపోయేలా ఉంది. ఇక పాజిటివ్ టాక్ వస్తే మంచి లాభాలూ ఖాయం.
ఇంతకీ బాక్సాఫీస్ దగ్గర ‘ఓజీ’ టార్గెట్ ఎంత అన్నది ఆసక్తికరం. అది రూ.170 కోట్లు షేర్ అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఏరియాలూ కలిపి రూ.100 కోట్ల మేర బిజినెస్ అయింది ‘ఓజీ’కి. అందులో సీడెడ్ వాటా పాతిక కోట్ల దాకా ఉండొచ్చు. తెలంగాణ రైట్స్ రూ.55 కోట్లు తెచ్చిపెట్టాయి. ఓవర్సీస్ హక్కులను చాలా ముందుగా కొంచెం తక్కువ మొత్తానికే దక్కించుకున్నారు. ఐతే సినిమా ఆలస్యం కావడం వల్ల వడ్డీల భారం పడి ఓవరాల్ రైట్స్ రేటు పెరిగినట్లు భావించాలి.
ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ.25 కోట్లకు అటు ఇటుగా వాల్యూ చేయొచ్చు. ఇలా మొత్తం థియేట్రికల్ హక్కులు రూ.160 కోట్ల మేర పలికాయి. పబ్లిసిటీ, అదనపు ఖర్చులు కలిపితే లెక్క రూ.180 మేర షేర్ రాబట్టాల్సి ఉండొచ్చు. అంటే ‘ఓజీ’ వరల్డ్ వైడ్ రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశముంది. ఆ లెక్కను దాటి వచ్చేది లాభం అన్నమాట. ఓజీ డే-1 గ్రాసే రూ.100 కోట్లను దాటిపోవడం ఖాయం. సినిమాకు టాక్ బాగుంటే దసరా సెలవుల్లో వసూళ్ల మోత మోగించి రికార్డ్ బ్రేకింగ్ రీజనల్ మూవీగా నిలిచే అవకాశాలున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates