ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్లు ఉన్న చోటల్లా ఇప్పుడు ‘ఓజీ’ నామస్మరణే వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ఇదొకటి. సరైన ప్రమోషన్లు చేయకపోయినా.. ట్రైలర్ చాలా ఆలస్యంగా రిలీజైనా.. ఈ సినిమాకు ముందే కావాల్సినంత హైప్ వచ్చేసింది. హైప్ మరీ ఇలా పెరిగిపోతే.. రేప్పొద్దున సినిమాతో ఇంప్రెస్ చేయగలమా అని మేకర్స్ కంగారు పడే స్థాయికి హైప్ వెళ్లిపోయింది.
దీనికంతటికీ మూలం.. రెండేళ్ల ముందు వచ్చిన టీజర్. అక్కడ్నుంచే హైప్ పెరుగుతూ పోయింది.
ఈ సినిమాకు వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరుగుతున్నాయి. కానీ ‘ఓజీ’ టీం ప్లానింగ్, రిలీజ్ ముంగిట హడావుడి పడడం మాత్రం అభిమానులకు రుచించడం లేదు. ‘ఓజీ’కి సంబంధించి పవన్ కళ్యాణ్ చిత్రీకరణ పూర్తి చేసి మూడు నెలలు దాటింది. పోస్ట్ ప్రొడక్షన్‌కు కావాల్సినంత టైం దొరికింది. రిలీజ్ డేట్ కూడా చాలా ముందే ఖరారైంది.
అయినా చివరి నిమిషంలో కిందా మీదా పడుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
యుఎస్ ప్రిమియర్స్‌కు రెండు రోజుల ముందు కూడా అక్కడ కంటెంట్ డెలివరీ కాలేదు. దీంతో ముందు ప్లాన్ చేసిన కొన్ని షోలను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. మిగతా స్క్రీన్లలో అయినా సమయానికి ప్రిమియర్స్ పడతాయా లేదా అని డిస్ట్రిబ్యూటర్ కంగారు పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సోమవారానికి పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఓపెన్ కాలేదు.
ఏపీలో మెజారిటీ థియేటర్ల బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ట్రైలర్, సెన్సార్ విషయంలో కూడా బాగా ఆలస్యం జరిగింది.
కన్సర్ట్ ప్లానింగ్ తుస్సుమనిపించడం అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. ప్రమోషన్ల గురించి అసలు చెప్పడానికి ఏమీ లేదు. ‘ఓజీ’కి ఉన్న హైప్‌కి ఈ హడావుడి లేకుండా రెండు వారాల ముందు ఫస్ట్ కాపీ తీసి సరిగ్గా రిలీజ్ ప్లాన్ చేసి ఉంటే.. ఈ సినిమా రేంజే వేరుగా ఉండేదని.. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా ‘ఓజీ’ రికార్డులు బద్దలు కొడితే అది పూర్తిగా పవన్ కళ్యాణ్ క్రేజే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates