Movie News

సక్సెస్ ఫార్ములా… దేవుళ్ళ లీల

కొత్త జనరేషన్ లో గుళ్లకు వెళ్లి దేవుడిని మొక్కే భక్తి ప్రపత్తులు ఎన్ని ఉన్నాయో చెప్పలేం కానీ తెరమీద మాత్రం ఇదో సక్సెస్ ఫుల్ ఫార్ములాగా మారుతోంది. ఫాంటసీ ప్రపంచం, దైవత్వంతో ముడిపడిన ఒక కీలకమైన ఎలిమెంట్, మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వెరసి కాసుల వర్షం కురుస్తోంది. తాజాగా విడుదలైన మిరాయ్ కొచ్చిన స్పందన చూస్తే ఇది నిజమనిపించక మానదు. క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ తో అశోకుడి తొమ్మిది పుస్తకాలు, శ్రీరాముడి అస్త్రంని తీసుకుని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఆవిష్కరించిన వైనం క్లాసు మాసు అందరినీ మెప్పించేసింది. ఇదొక్కటే కాదు ఫ్లాష్ బ్యాక్, ఫ్యూచర్ లో వచ్చిన రాబోయే సినిమాలు ఇదే స్పష్టం చేస్తున్నాయి.

హనుమాన్ లో జరిగింది ఇదే. తన బలం తనకు తెలియని హీరోకి అతి పెద్ద బాధ్యత వచ్చినప్పుడు సాక్ష్యాత్తు అంజనీ పుత్రుడే దిగి వస్తాడు. ఈ అంశం జనాలకు విపరీతంగా ఎక్కేసింది. కార్తికేయ 2లో చందూ మొండేటి తీసుకున్న ద్వారకా బ్యాక్ డ్రాప్, శ్రీకృష్ణుడి నేపథ్యం నార్త్ ఆడియన్స్ ని ఊపేశాయి. చిరంజీవి విశ్వంభరలోనూ హనుమంతుడి కీలక భూమిక ఉంటుంది. సుదీర్ బాబు జటాధర మీద భారీ బడ్జెట్ పెట్టడానికి కారణం లయకారకుడైన ఈశ్వరుడిని సరికొత్తగా ఆవిష్కరించడమే. మోహాన్ లాల్ వృషభలోనూ నీలకంఠుడి విన్యాసాలు చూడొచ్చట. అభిషేక్ నమ రూపొందిస్తున్న నాగబంధం లో అనంత పద్మనాభస్వామి అంశం కీలకం కావడంతో దేవాలయాల సెట్ల కోసం కోట్లు ఖర్చుపెట్టడానికి అస్సలు వెనకడట్లేదు అనేది వాస్తవం. మహేష్ బాబు – రాజమౌళి కాంబోలోనూ ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయట.

నిఖిల్ స్వయంభులో ఏకంగా శతాబ్ధాల నాటి వెనుకటి చరిత్రను తీసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలున్నాయి. జనాన్ని త్వరగా ఆకట్టుకుంటున్న ఈ జానర్ ఇప్పటికైతే నిక్షేపంగా వర్కౌట్ అవుతోంది కానీ ఎంతకాలం ఈ ట్రెండ్ ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే గతంలో అంజి, ఢమరుకం లాంటివి కాన్సెప్ట్స్ బాగున్నా ఎగ్జిక్యూషన్ వల్ల డిజాస్టర్లయ్యాయి. కానీ ఇప్పటి దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొరపాట్లు చేయకుండా హ్యాండిల్ చేస్తున్నారు. అందుకే వీటిలో ఫెయిల్యూర్స్  శాతం తక్కువగా ఉంది. ఇది ఎంత కాలం ఉంటుందో వేచి చూడాలి.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

6 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

7 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

9 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

9 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

10 hours ago