Movie News

మంచి ఛాన్స్ మిస్సవుతున్న పవన్

‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోవాలని ప్రతి స్టార్ హీరో ఆశపడ్డవాడే. కానీ అందరికీ కాలం కలిసి రాలేదు. పాన్ ఇండియా లేబుల్ వేసుకుని వచ్చిన చాలా సినిమాలు దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. కొన్ని చిత్రాలకూ దేశవ్యాప్తంగా అనూహ్యమైన ఆదరణ దక్కి హీరోలకు ఊహించని ఫాలోయింగ్ వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాల మీద ఫోకస్ తగ్గించినప్పటికీ ఆయన కొన్ని పాన్ ఇండియా ప్రయత్నాలు చేశారు. 

సర్దార్ గబ్బర్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలతో తెలుగేతర భాషల వాళ్లనూ ఆకట్టుకోవాలని చూశారు. కానీ ఆ సినిమాల్లో కంటెంట్ బలంగా లేకపోవడంతో పాన్ ఇండియా రిలీజ్ నామమాత్రం అయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ సరిగా ఆడని ఈ చిత్రాలు.. మిగతా చోట్ల ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఐతే పవన్ పాన్ ఇండియా లాంచింగ్‌కు సరైన సినిమా చేతిలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఆ దిశగా ప్లానింగ్ సరిగా లేకపోవడం అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తోంది.

ఓజీ.. పవన్ కెరీర్లోనే అత్యధిక హైప్‌తో వస్తున్న సినిమా. ఈ సినిమా కోసం అభిమానులు ఊగిపోతున్నారు. యుఎస్‌లో ఈ సినిమాకు రెండు వారాల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఆల్రెడీ ఈ చిత్రం మిలియన్ మార్కును దాటేసింది. కల్కి, పుష్ప లాంటి చిత్రాల కంటే వేగంగా ఆ మార్కును అందుకుందీ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ చేసినా రచ్చ మామూలుగా ఉండదని అర్థమవుతోంది. ఈ సినిమా ప్రోమోలు చూసి ఇతర భాషల వాళ్లు కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

కానీ ‘ఓజీ’ పాన్ ఇండియా రిలీజ్ విషయంలో మేకర్స్ అంత సీరియస్‌గా ఉన్నట్లు లేరు. ఇతర భాషల్లో అసలు ప్రమోషన్ అన్నదే లేదు. హిందీలో చాలా లిమిటెడ్ రిలీజ్ ఉండబోతోందీ సినిమాకు. ఓటీటీ విండో 8 వారాల్లోపు ఉండడంతో నార్త్ మల్టీప్లెక్సులు ఈ సినిమాను ప్రదర్శించబోవు. లేక లేక పవన్ నుంచి అభిమానులు ఆశించే బలమైన కంటెంట్ ఉన్న, హీరోయిక్ మూవీ వస్తుంటే.. దీన్ని ఇతర భాషల్లో సరిగా రిలీజ్ చేయకపోవడం, ప్రమోట్ చేయకపోవడం పట్ల అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు తెలుగులో కూడా ఈ సినిమాను సరిగా ప్రమోట్ చేయట్లేదు. దీనికి ఉన్న హైప్ దృష్ట్యా తెలుగులో పబ్లిసిటీ లేకపోయినా పర్వాలేదు. కానీ ఇలాంటి సినిమాకు పాన్ ఇండియా రిలీజ్, ప్రమోషన్ ప్లానింగ్‌ లేకపోవడం చూస్తే మంచి ఛాన్స్ మిస్సవుతున్నట్లే కనిపిస్తోంది.

This post was last modified on September 10, 2025 10:47 pm

Share

Recent Posts

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

44 minutes ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

1 hour ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

4 hours ago

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

8 hours ago

బాలకృష్ణ – తమన్… ఆరేళ్ల నుంచి గ్యాప్ లేదు

బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…

8 hours ago

తెల్లదొరల అరాచకంపై ‘రణబాలి’ రణం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…

9 hours ago