తమిళంలో అగ్ర కథానాయకులైన విజయ్, అజిత్ ఇద్దరూ కూడా చాలా సింపుల్‌గా ఉంటారు. ఎక్కువ మాట్లాడరు. వివాదాలకు దూరంగా ఉంటారు. అభిమానులను ఎప్పుడూ రెచ్చగొట్టరు. వాళ్లను ఎక్కువగా ఎంగేజ్ చేయరు. ముఖ్యంగా అజిత్ అయితే తన సినిమాల ఆడియో, ప్రి రిలీజ్ ఈవెంట్లు కూడా చేయనివ్వడు. అభిమానులను నేరుగా కలవడు. వాళ్లతో ఏ రకమైన కమ్యూనికేషన్ పెట్టుకోడు. డబ్బులు పెట్టించి పీఆర్వోలతో అభిమాన సంఘాలను మెయింటైన్ కూడా చేయించడు. విజయ్ సైతం సాధ్యమైనంత సింపుల్‌గానే సాగిపోతాడు. అభిమానుల్ని ఎప్పుడూ రెచ్చగొట్టడు.
కానీ వీళ్లిద్దరి అభిమానులు తమ హీరోలకు పూర్తి విరుద్ధం. వాళ్లు నిరంతరం తమ హీరోకు ఎలివేషన్లు ఇస్తూ.. అవతలి హీరోను కించపరిచే ప్రయత్నంలోనే ఉంటారు. దక్షిణాదిన సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్‌కు శ్రీకారం చుట్టింది.. వాటిని దిగజార్చింది ప్రధానంగా వీళ్లే.
నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి వేరే హీరోను కించపరిచే ట్రెండ్ మొదలుపెట్టిందే విజయ్, అజిత్ అభిమానులు. తరచుగా వీళ్లు ఈ గేమ్ ఆడుతుంటారు. ఒకరి అభిమానులు అవతలి హీరో మీద నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు మొదలుపెట్టడం.. తర్వాత అవతలి హీరో అభిమానులు దానికి పోటీగా ఇంకో హ్యాష్ ట్యాగ్ తేవడం.. కొన్నేళ్లుగా నడుస్తోంది. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ.. ఇప్పుడు మళ్లీ వాళ్ల వార్ మొదలైంది. నిన్న విజయ్ అభిమానులేమో #crossbreedajith అని.. అజిత్ ఫ్యాన్సేమో #cressgendervijayfans అని హ్యాష్ ట్యాగ్‌లు పెట్టి ట్రెండ్ చేశారు.
ఎవరు ముందు మొదలుపెట్టారన్నది పక్కన పెడితే.. ఇరు వర్గాలూ దిగజారి పోయి ట్వీట్లు వేశారు. అందులో ఎడిట్‌లు, మీమ్స్, ట్రోల్స్ చూస్తే అభిమానులు ఇంత చీప్‌గా ఉంటారా అనిపిస్తుంది. ఇండియా లెవెల్లో ఇవి ట్రెండ్ అయ్యాయి. మేం ఎక్కువ ట్వీట్లు వేశాం అంటే మేం ఎక్కువ వేశాం అని దాన్నో ఘనకార్యం లాగా చెప్పుకున్నారు ఇరువురి అభిమానులు. ఇంతకంటే దిగజారుడు ఏముంటుంది?
This post was last modified on November 22, 2020 5:42 pm
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…
న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... బీజేపీ మహిళా నేత, సినీ…
ఏదైనా పెద్ద సినిమాకు సంగీత దర్శకుడిని ఎంచుకునే పని స్టార్ హీరోల దర్శకులకు పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో…
టీడీపీ… దేశ రాజకీయాల్లో ఓ ప్రభంజనం. ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే అధికారం చేజిక్కించుకున్న పార్టీగా టీడీపీపై ఉన్న రికార్డు…
వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు నిత్యం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సెటైర్ల మీద సెటైర్లు వేసే వారు.…