భారీ ఓపెనింగ్స్ కోసం బాలీవుడ్ కంపెనీలు సహజంగా వాడే స్ట్రాటజీ కార్పొరేట్ బుకింగ్స్. అంటే నిర్మాత ఎంపిక చేసిన మల్టీప్లెక్సుల్లో గంపగుత్తగా టికెట్లన్నీ కొనేసి వాటిని బుక్ మై షోలో హౌస్ ఫుల్స్ గా చూపిస్తారు. తీసుకున్న వాటిని ఉచితంగా వివిధ మార్గాల్లో పంచి పెట్టడం ద్వారా థియేటర్లో జనాలు నిండుగా కనిపించేలా చూసుకుంటారు. ఇలా చేయడం వల్ల లాభమేంటంటే పెద్ద నెంబర్లు చూపించుకోవచ్చు. ఓటిటిలకు తమ మూవీ ఎంత రెవిన్యూ సాధించిందో గర్వంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాబోయే సినిమాలకు హైప్ వచ్చేలా ఈ బిజినెస్ ని సాక్ష్యంగా పెట్టేసుకోవచ్చు. ఇలా బోలెడు ప్రయోజనాలు, లాభాలు ఉంటాయి.
కూలికి కూడా ఇదే తరహాలో కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతున్నాయని కొందరు యాంటీ ఫ్యాన్స్ ప్రచారం మొదలుపెట్టడంతో సోషల్ మీడియాలో ఇది కాస్తా హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు మ్యాటర్ వేరే ఉంది. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఒక థియేటర్ ఓనర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల కోసం హోల్ సేల్ గా కూలీ టికెట్లన్నీ బుక్ చేసుకున్నాయని, అందుకే బయటి వాళ్లకు దొరకడం లేదని చెప్పారు. అంటే ఇక్కడ ఖర్చు మొత్తం సదరు కంపెనీ పెడుతుంది. డబ్బులన్నీ న్యాయంగా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్లకు వెళ్తాయి. నిర్మాత తాను స్వంతంగా జేబు నుంచి ఖర్చు పెట్టడం ఉండదు.
కార్పొరేట్ బుకింగ్స్ లో ప్రొడ్యూసర్ స్వంతంగా ఖర్చు పెట్టుకుని ఫ్రీగా చూపించాలి. కార్పొరేట్ కంపెనీ బుకింగ్స్ లో ఎంప్లాయిస్ కోసం ఓనర్లు ఖర్చు పెట్టుకుంటారు. రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అదే అర్థం చేసుకోలేని కొందరు కూలికి తప్పుడు నెంబర్లు వచ్చేలా చేస్తున్నారని ట్వీట్లు పెట్టడంతో న్యూట్రల్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయినా కూలి మేనియా ఏ స్థాయిలో ఉందో ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. ఓవర్సీస్ లో వేగంగా రెండు మిలియన్ మార్కు దాటేసిన రజనీకాంత్ ఏడు పదుల వయసులోనూ తన సత్తాను చాటుతున్నారు. టాక్ పాజిటివ్ గా ఉంటే మాత్రం బాక్సాఫీస్ సునామి ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates