Movie News

సీనియర్ పక్కన శ్రీలీల.. సెట్టవుతుందా?

సీనియర్ హీరోల పక్కన జూనియర్ హీరోయిన్లు నటించడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్‌కు మనవరాలి పాత్ర పోషించిన శ్రీదేవే.. కాల క్రమంలో ఆయన పక్కన కథానాయికగా చేశారు. ఐతే సోషల్ మీడియా లేనపుడు ఇలా ఎవరితో ఎవరికి జోడీ కట్టించినా చెల్లిపోయింది కానీ.. ఇప్పుడు మరీ వయసు అంతరం ఉన్న హీరోయిన్‌తో ఒక హీరో జోడీ కడితే.. నెటిజన్లు ఊరుకోరు. జోడీ ఆడ్‌గా అనిపిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్ తప్పదు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల.. కెరీర్ ఆరంభంలో రవితేజ పక్కన కథానాయికగా నటిస్తే.. విమర్శలు తప్పలేదు. 

రవితేజ పక్కన మరీ చిన్నపిల్లలా ఉందంటూ కౌంటర్లు పడ్డాయి. కానీ వీరి కలయికలో వచ్చిన ‘ధమాకా’ పెద్ద హిట్టవడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. శ్రీలీల కథానాయికగా పరిచయమై ఐదారేళ్లు గడిచిపోయినప్పటికీ.. ఇంకా ఆమెలో అయితే టీనేజీ ఛాయలు పోలేదు. ఇప్పటికీ సీనియర్ హీరోల పక్కన ఆమె కొంచెం ఆడ్‌గా అనిపిస్తుందనే ఫీలింగే ఉంది. ఇప్పుడు ఆమె కొత్త సినిమా గురించి కబురు విన్నవాళ్లందరికీ.. ఆమె ఆ హీరో పక్కన సెట్టవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

కోలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన అజిత్ సరసన శ్రీలీల నటించబోతోందట. అజిత్‌కు చాన్నాళ్ల తర్వాత ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రూపంలో హిట్ ఇచ్చిన ఆయన ఫ్యాన్ బాయ్ ఆధిక్ రవిచంద్రన్.. మళ్లీ తన అభిమాన కథానాయకుడితో జట్టు కట్టబోతున్నాడు. త్వరలోనే ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈ చిత్రంలో అజిత్‌కు జోడీగా శ్రీలీలను ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఐతే ఈ సమాచారం బయటికి రాగానే.. అజిత్ పక్కన శ్రీలీల ఎలా సెట్ అవుతుంది.. లుక్స్ పరంగా కానీ, వయసు పరంగా కానీ ఇద్దరికీ అస్సలు సెట్ కాదనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. శ్రీలీ ఇప్పటికే తమిళంలో ఓ సినిమా చేస్తోంది. అదే.. పరాశక్తి. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. అది పూర్తి కాకముందే దాన్ని మించిన పెద్ద సినిమా దక్కించుకోవడం బాగానే ఉంది కానీ.. అజిత్ పక్కన ఆమె సూటవుతుందో లేదో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

This post was last modified on August 9, 2025 2:35 pm

Share

Recent Posts

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

40 minutes ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

1 hour ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

2 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

3 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

3 hours ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

8 hours ago