ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక టికెట్ రేట్ల పెంపు మాములు విషయమైపోయింది. తాజాగా కింగ్డమ్ కు అనుమతులు ఇస్తూ జిఓ వచ్చేసింది. మాములుగా రిలీజ్ కు రెండు మూడు రోజుల ముందు జరిగే ఈ తతంగం ఈసారి వారం ముందే పూర్తి కావడం గమనార్హం. ఏపీలో ఉన్న మల్టీప్లెక్సులు ఒక్కో టికెట్ మీద 75 రూపాయలు, సింగల్ స్క్రీన్లు 50 రూపాయలు అదనంగా పది రోజుల పాటు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది విజయ్ దేవరకొండ మార్కెట్ కోణంలో చూసుకుంటే పెద్ద మొత్తమే. కాకపోతే ఈసారి బడ్జెట్ డిమాండ్ కు తగట్టు సితార ఎంటర్ టైన్మెంట్స్ పెంపుని కోరుకుంది.
తెలంగాణలో కింగ్డమ్ కు ఎలాంటి హైక్స్ అడగకపోవచ్చని ఇన్ సైడ్ టాక్. ఎందుకంటే అక్కడ అనుమతించిన గరిష్ట ధర మల్టీప్లెక్సులకు 295, సింగల్ స్క్రీన్లకు 175 రూపాయలు ఎలాంటి పర్మిషన్లు అవసరం లేకుండా పెట్టేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ కావాలంటే గవర్నమెంట్ కు అప్లికేషన్ పెట్టుకోవాలి. బహుశా కింగ్డమ్ కు ఆ అవసరం రాకపోవచ్చు. ఏపీలో అలాంటి పద్ధతి లేదు కాబట్టి ప్రతిసారి జిఓలు తప్పవు. దీంట్లో మార్పు తేవాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఒక కమిటీ వేసిన ప్రభుత్వం, త్వరలో రిపోర్ట్ ని బట్టి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా జూలై 31 విడుదల కాబోతున్న కింగ్డమ్ కు గ్రౌండ్ రెడీ అవుతోంది. హరిహర వీరమల్లు టాక్, ఫైనల్ స్టేటస్ ఎలా ఉండబోతోందనేది ఒక క్లారిటీ వచ్చేసిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీమ్ ప్రమోషన్లను పెంచబోతోంది. ముఖ్యంగా జూలై 26 వచ్చే ట్రైలర్ ఓపెనింగ్స్ మీద చాలా ప్రభావం చూపించనుంది. ఇప్పటిదాకా జానర్, సబ్జెక్టు గురించి ఎక్కువ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈసారి కథలో మెయిన్ పాయింట్ ఏంటో చెప్పబోతున్నారు. యాక్షన్ హీరోగా హై ఇంటెన్స్ పాత్రను చేస్తున్న రౌడీ బాయ్ కు ఇది హిట్టవ్వడం చాలా కీలకం. ఇంకో ఏడు రోజుల్లో సస్పెన్స్ తీరనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates