తారక్‍ని ఇరకాటంలో పెట్టిన త్రివిక్రమ్‍!

ఎన్టీఆర్‍ ‘ఆర్‍.ఆర్‍.ఆర్‍.’తో బిజీగా వున్నాడు కాబట్టి, ఆ సినిమాకి సంబంధించి తన వర్క్ ఎప్పటికి పూర్తవుతుందనేది తెలియదు కాబట్టి… అంతవరకు వేచి వుండలేక త్రివిక్రమ్‍ ఈలోగా మరో సినిమా చేయాలని ప్లాన్‍ చేసుకున్నాడు. అగ్ర హీరోతో సినిమాకు ఎన్టీఆర్‍ అభ్యంతరం చెబుతున్నాడని ఒక మిడిల్‍ రేంజ్‍ సినిమా చేసే ఆలోచనలో వున్నాడని కూడా చెప్పుకున్నారు. అయితే త్రివిక్రమ్‍ ఇప్పుడు అవన్నీ పక్కనపెట్టి తారక్‍ కోసమే ఎదురు చూస్తున్నాడు.

మార్చి నుంచి తాను ఖచ్చితంగా అందుబాటులో వుంటానని తారక్‍ మాట ఇవ్వడంతో త్రివిక్రమ్‍ మిగతా ప్లాన్స్ రద్దు చేసుకున్నాడు. అంతే కాకుండా ఆ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‍ పనులు కూడా ముమ్మరం చేస్తున్నాడు. తద్వారా తారక్‍పై త్రివిక్రమ్‍ ఒత్తిడి పెంచుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్‍ తప్పనిసరిగా మార్చి నుంచి ఈ చిత్రం షూటింగ్‍లో పాల్గొనాలి. కానీ అది ఎన్టీఆర్‍ చేతిలో లేదు. రాజమౌళి ఎప్పటికి తనకు గ్రీన్‍ సిగ్నల్‍ ఇస్తాడనే దానిపై క్లారిటీ లేదు.

ఇదిలావుంటే తారక్‍ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‍ పనులతో పాటు పవన్‍తో సితార ఎంటర్‍టైన్‍మెంట్స్ నిర్మిస్తోన్న ‘అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍’ చిత్రానికి త్రివిక్రమ్‍ మార్పులు చేసి, మాటలు అందిస్తారనే ప్రచారం జరుగుతోంది.