కొత్త ఏడాదిలో అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. టాలీవుడ్ లో కనివిని ఎరుగని అద్భుతాలు జరగలేదు. ప్యాన్ ఇండియా వండర్లు రాలేదు. మధ్యలో అయిదారు వారాలు థియేటర్ల పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యింది. పడటం లేవడం బాక్సాఫీస్ కు సర్వ సాధారణంగా మారిపోయిన తరుణంలో సక్సెస్ రేట్ అంతకంతా పడిపోవడం ఒక వార్నింగ్ బెల్ గా తీసుకోవాలి. గడిచిన ఈ అర్ధ సంవత్సర కాలంలో గట్టిగా చెప్పుకునే హిట్లు కేవలం తొమ్మిదేనంటే ఆశ్చర్యం కలిగినా అక్షరాలా నిజం. ఇప్పటిదాకా వచ్చిన వాటిలో యునానిమస్ విన్నర్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిలిచింది. ఏకంగా మూడు వందల కోట్ల వసూళ్లతో సింహాసనం మీద కూర్చుంది.
అదే జనవరిలో వచ్చిన ‘డాకు మహారాజ్’ ఓ మోస్తరు హిట్ గా నిలిచింది కానీ మరీ ఫ్యాన్స్ ఊహించుకున్న అఖండ రేంజ్ లో మేజిక్ అయితే చేయలేదు. దర్శకుడు బాబీ వర్కౌట్ అయ్యే ప్రోడక్ట్ ఇవ్వడం ఊరట. ‘తండేల్’ వంద కోట్ల క్లబ్బులో చేరడం ద్వారా చైతు ఫ్లాపుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. నాని నిర్మించిన ‘కోర్ట్’ ఊహించిన దానికన్నా పెద్ద విజయం అందుకోవడం ట్రేడ్ కి లాభాలు వచ్చేలా చేసింది. నాని హీరోగా వచ్చిన ‘హిట్ 3 ది థర్డ్ కేస్’ మరీ తీవ్రంగా కాదు కానీ హిట్టు క్యాటగిరీలో పడిపోవడం ఊరట కలిగించింది. లిమిటెడ్ బడ్జెట్ తో వచ్చిన ‘సింగిల్’ కొన్నవాళ్లకు డబుల్ ప్రాఫిట్స్ ఇచ్చి క్షేమంగా గట్టెక్కింది.
సీక్వెల్ క్రేజ్ తో వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ సైతం సక్సెస్ బాట పట్టి హిట్టు లిస్టులో చేరిపోయింది. తాజాగా ‘కుబేర’తో పాటు ‘కన్నప్ప’ కూడా సక్సెస్ బాట పట్టడం శుభ పరిణామం. విచారకరంగా మంచి అంచనాలు తెచ్చుకున్న చాలా సినిమాలు దారుణంగా దెబ్బ కొట్టడం ఆ ఆరు నెలల్లో అసలు ట్రాజెడీ. గేమ్ ఛేంజర్, లైలా, దిల్ రుబా, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, మజాకా, రాబిన్ హుడ్, జాక్, ఓదెల 2, సారంగపాణి జాతకం, భైరవం, 8 వసంతాలు మొదలైనవన్నీ డీసెంట్ హైప్ తో వచ్చి తీవ్రంగా నిరాశపరిచాయి. ఇంకా అడ్రెస్ లేకుండా పోయిన చిన్నా చితక లిస్టు పెద్దదే ఉంది. రాబోయే ఆరు నెలల కాలం టాలీవుడ్ కు చాలా కీలకం కానుంది.
This post was last modified on June 30, 2025 1:44 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…