డీఎస్పీని తోమేస్తున్న బన్నీ!

అల వైకుంఠపురములో తర్వాత తమన్ తోనే సంగీతం చేయించుకోవాలని అల్లు అర్జున్ అనుకున్నాడు. అయితే తనకి సూపర్ హిట్ ఆడియోస్ ఎన్నో ఇచ్చిన దేవిశ్రీప్రసాద్ ని ఎందుకు మార్చాలని సుకుమార్ అందుకు ఒప్పుకోలేదు. అయితే దేవి ఇప్పుడు మునుపటి ఫామ్ లో లేడు. తాను ఆల్రెడీ చేసిన పాటలనే అటు తిప్పి, ఇటు తిప్పి మళ్ళీ కొడుతున్నాడు. పుష్పకి ఆలా చేస్తే మాత్రం కుదరదని అల్లు అర్జున్ అతనికి గట్టిగా చెప్పేసాడు.

పుష్ప పాటలు ఆర్య కంటే బాగుండాలని, అప్పట్లో ఎంత ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చావో ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని బన్నీ తేల్చడంతో సుకుమార్ కంటే హీరోని ఇంప్రెస్ చేయడం మీద డీఎస్పీ ఫోకస్ పెట్టాడు. అల్లు అర్జున్ ని మెప్పించడం అంటే అతడిని ఒక్కడిని మెప్పిస్తే సరిపోదు. అతని టీం అంతటిని, గీత ఆర్ట్స్ బ్యాచ్ ని, బన్నీ కుటుంబ సభ్యులని కూడా అలరించాలి. అందరికి పాట వినిపించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాకే అల్లు అర్జున్ ఓకే చెప్తాడు.

లాక్ డౌన్ అయినా కూడా డీఎస్పీ ఇప్పుడు తన స్టూడియోలో పుష్ప పాటల కోసమే కసరత్తు చేస్తున్నాడు. మాములుగా సుకుమార్ సినిమాలకి అతనే అన్నీ ఓకే చేస్తాడు. కానీ ఈసారి హీరోదే డామినేషన్.