స్పిరిట్ నుంచి దీపికా పదుకునే తప్పుకోవడం గురించి మినీ సైజ్ రచ్చే జరిగింది. తన కండీషన్లు, రెమ్యునరేషన్ నచ్చక సందీప్ రెడ్డి వంగా పక్కన పెట్టాడని ఒక వర్గం, లేదు బిడ్డ తల్లిగా కొత్త బాధ్యత వచ్చిన తనకు పని గంటలకు సంబంధించి మినహాయింపు దొరకనందుకే తప్పుకుందని ఇంకో బ్యాచ్ ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూర్చేలా దీపికాకు ఏ మాత్రం సరితూగని త్రిప్తి డిమ్రిని మెయిన్ హీరోయిన్ గా తీసుకుని సందీప్ వంగా పెద్ద షాకే ఇచ్చాడు. అయితే ఇవాళ విడుదలైన అల్లు అర్జున్ 22 అనౌన్స్ మెంట్ మీడియాలో దీపికా గెటప్ చూశాక ఫ్యాన్స్ ఆశ్చర్యం, ఆనందం రెండూ మిక్స్ చేసి చూశారు.
ఇప్పుడో కొత్త టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ ఎప్పుడు మొదలవుతుందో సరైన స్పష్టత లేదు. పైగా ఎన్ని డేట్లు అవసరమతాయనే క్లారిటీ మిస్సయ్యింది. దీని కోసం వెయిట్ చేయడం కన్నా ఇంకో నెలలో సెట్స్ పైకి వెళ్లబోయే బన్నీ మూవీ అయితే తనకు ఇంకా మైలేజ్ వస్తుందని భావించడం వల్లే దీపికా నిర్ణయం మార్చుకున్నట్టు ముంబై సర్కిల్స్ లో వినిపిస్తోంది. అంతే కాదు ఎలాగూ కల్కిలో ప్రభాస్ సరసన జోడి కట్టేయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ గా అల్లు అర్జున్ పక్కన కనిపిస్తే తన ఫిల్మోగ్రఫీలో మరో ల్యాండ్ మార్క్ మూవీ తోడవుతుందని ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చని మాట్లాడుతున్నారు.
ఏది నిజమో ఏమో కానీ ఇవాళ్టి వీడియోలో కత్తులు ఆయుధాలు పట్టుకుని ప్రమాదకరమైన సాహసాలు చేసే క్యారెక్టర్ ని అట్లీ డిజైన్ చేసిన విధానం చూస్తే పెద్ద స్కెచ్చే కనిపిస్తోంది. దీపికా కొంత కాలంగా ఇంత ప్రాధాన్యం ఉన్న పాత్ర అది కూడా ఫాంటసీ మూవీలో చేయలేదు. సో ఇదో అవకాశంగా భావించి ఉండొచ్చు. మరో న్యూస్ ఏంటంటే దీన్ని అట్లీ రెండు భాగాలుగా ప్లాన్ చేసుకున్నాడట. అందరిలా ఒకదాని తర్వాత మరొకటి కాకుండా ఒకేసారి రెండు పార్ట్స్ పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ఉన్నాడని అంటున్నారు. ప్రకటన స్టేజిలోనే ఇంత హాట్ టాపిక్ గా మారిన ఏఏ 22 ఇక అసలు షూట్ మొదలయ్యాక ఇంకే సెన్సేషన్లు తెస్తుందో.