అల్లు అర్జున్ సరసన అయిదుగురు హీరోయిన్లు ?

ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే అల్లు అర్జున్ 22 టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్న నేపథ్యంలో దర్శకుడు అట్లీ హైదరాబాద్ వచ్చేసి ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశాడు. నిత్యం బన్నీతో చర్చలు జరుపుతూ ముందస్తు ఏర్పాట్ల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాడని తెలిసింది. ఇదిలా ఉండగా ఏఏ 22లో హీరో పాత్ర మూడు రూపాల్లో ఉంటుందనే లీక్ గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. హీరో, విలన్, యానిమేటెడ్ పాత్ర మూడూ అల్లు అర్జునే పోషించబోతున్నాడనే లీక్ ఇటీవలే చక్కర్లు కొట్టింది . అఫీషియల్ గా బయటికి రాలేదు

మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకునే కన్ఫర్మ్ అయ్యిందనే వార్త ముంబై మీడియాలోనూ జోరుగా తిరుగుతోంది. తనతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ లను తీసుకున్నట్టుగా ఇంకో న్యూస్ తోడయ్యింది.. నిజమైతే మటుకు ఇది చాలా క్రేజీ కాంబినేషన్ అవుతుంది. ఎందుకంటే ఈ ముగ్గురి కలయిక బాలీవుడ్ బిజినెస్ కు బూస్ట్ అవుతుంది. పుష్ప తెచ్చిన ఇమేజ్ తో బన్నీకి ఆల్రెడీ హిందీలో బలమైన మార్కెట్ ఏర్పడగా ఇప్పుడీ హీరోయిన్ల లిస్టుతో హైప్ మరింత పెరుగుతోంది. ఇక్కడితో అయిపోలేదు. నాలుగో కథానాయికగా భాగ్యశ్రీ బోర్సేని అడుగుతున్నారని తెలిసింది. తనింకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.

చివరిగా అయిదో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోందని ఇన్ సైడ్ టాక్. ఇంత మంది ఏం చేస్తారంటే కథలో అంత స్కోప్ ఉందని అంటున్నారు. ఫాంటసీ జానర్ కాబట్టి చిత్ర విచిత్ర ప్రపంచాలు, బోలెడన్ని పాత్రలు, ట్విస్టులు ఎన్నో ఉంటాయి. దానికి తోడు బన్నీనే ట్రిపుల్ రోల్ చేస్తున్నప్పుడు ఈ మాత్రం గ్లామర్ కోటింగ్ అవసరమే. షూటింగ్ ఎక్కువ ఆలస్యం కాకుండా ప్లాన్ చేసుకుంటున్న అట్లీ పోస్ట్ ప్రొడక్షన్ కి తగినంత సమయం దొరికేలా చూసుకుంటున్నాడు. భారీ ఎత్తున విదేశీ విఎఫ్ఎక్స్ కంపెనీలు భాగం కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ కి సాయి అభ్యంకర్ అందించబోయే సంగీతం మీద ప్రత్యేక అంచనాలున్నాయి.