దెబ్బకు పేద్ద సెలబ్రిటీ అయిపోయింది

దివి వద్త్యా బిగ్‍బాస్‍ హౌస్‍లోకి అడుగు పెట్టినపుడు ఆమె ఎవరనేది చాలా మందికి తెలీదు. తెలుపు వస్త్రాలలో నడుమందాలు చూపిస్తూ బిగ్‍బాస్‍ స్టేజీపై మెరిసే సరికి ఎవరీ మెరుపు తీగ అనుకున్నారు. నాగార్జున సయితం ఆమె అందానికి ముగ్ధుడయి అక్కడే కాంప్లిమెంట్‍ ఇచ్చేసాడు.

ఆ హౌస్‍లోకి వెళ్లిన కొద్ది రోజుల్లో సోషల్‍ మీడియా బఫ్స్ తవ్వి తీయగా… ఆమె మహర్షి సినిమాలో చిన్న క్యారెక్టర్‍ చేసిందని గుర్తించారు. అప్పటికి ఆమె ఇన్‍స్టాగ్రామ్‍ ఫాలోవర్లు కనీసం ఇరవై వేలు కూడా లేరు. ఇన్‍స్టాగ్రామ్‍లో అందమైన అమ్మాయిలకు ఈ మాత్రం ఫాలోవర్లు వుండడం పెద్ద విషయమేమీ కాదు. బిగ్‍బాస్‍లో అడుగు పెట్టడం వల్ల దివి ఫాలోయింగ్‍ ఎన్నో ఇంతలయింది. ఇప్పుడామెకు నాలుగు లక్షల పైచిలుకు ఫాలోవర్లు వున్నారు. ప్రస్తుత వేగం చూస్తోంటే త్వరలోనే మిలియన్‍ ఫాలోవర్స్ వచ్చి పడిపోతారు.

బిగ్‍బాస్‍ టైటిల్‍ గెలవలేకపోయినా కానీ ఇలా ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న ఆనందంలో దివి వారికోసం తరచుగా లైవ్‍ చాట్‍లు చేస్తోంది. షార్ట్ వీడియోలు గట్రా చేస్తూ వారిని ఎంగేజ్‍ చేస్తోంది. చీరలో చితగ్గొట్టేసావ్‍ అనే కామెంట్లకు పొంగిపోతూ మరిన్ని శారీ షూట్లు కూడా చేసేస్తోంది. మరి హీరోయిన్‍ కావాలనే తన కలను కూడా త్వరగా సాకారం చేసుకుంటుందేమో చూడాలి.