సీతని మిస్ చేసుకున్న హిట్ 3 భామ

ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమా పరిశ్రమకు కూడా వర్తిస్తుంది. బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ గ్రాండియర్ గా తెరకెక్కుతున్న రామాయణలో సీతగా సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం కెజిఎఫ్, హిట్ 3 భామ శ్రీనిధి శెట్టి కూడా ఆడిషన్ కు వెళ్ళింది. రెండు మూడు సీన్లను ప్రాక్టీస్ చేసి మరీ అందులో పాల్గొంది. తనతో పాటు అలియా భట్ ని సైతం పరిశీలించారు. కానీ చివరికది సాయిపల్లవిని వరించింది. అందం కన్నా పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే క్యారెక్టర్ కావడంతో దర్శకుడు నితేశ్ తివారి తెలివైన నిర్ణయం తీసుకున్నారు.

ఇదంతా కెజిఎఫ్ 2 విడుదల టైంలో జరిగింది. రావణుడిగా యష్ చేయొచ్చనే విషయం శ్రీనిధికి అప్పుడే తెలిసింది. ఒకవేళ రామాయణ కనక తనను వరిస్తే కెజిఎఫ్ జంట ఇప్పుడు శత్రువుల్లా నటించాల్సి వస్తుందని ఊహించుకుని ఆనందపడింది. కానీ బ్యాడ్ లక్ అవకాశం వేరొకరికి వెళ్ళిపోయింది. ఇదంతా ఒక హిందీ ఇంటర్వ్యూలో శ్రీనిధి చెప్పింది. ఇండస్ట్రీ హిట్ కొట్టిన కెజిఎఫ్ తర్వాత శ్రీనిధి శెట్టి కెరీర్ ఆశించినంత వేగంగా వెళ్లడం లేదు. నానితో జట్టు కట్టిన హిట్ 3 ది థర్డ్ కేస్ తో పాటు సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా పెద్ద బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది. దానికి తగ్గట్టే ప్రమోషన్లలో హుషారుగా పాల్గొంటోంది.

నానితో పాటే ఉంటూ ముంబై నుంచి కోచి దాకా పబ్లిసిటీలో భాగమవుతున్న శ్రీనిధి శెట్టికి హిట్ 3 సక్సెస్ కావడం చాలా కీలకం. అమ్మడి హుషారు చూస్తుంటే ప్రాధాన్యం బాగానే ఇచ్చినట్టు ఉన్నారు. కథలో ముఖ్యమైన ట్విస్టుకి ఆమె క్యారెక్టరే కీలకమని యూనిట్ టాక్. ఆ ఎపిసోడ్ చుట్టే మొత్తం స్టోరీ నడుస్తుందని అంటున్నారు. ట్రైలర్ తప్ప ఇంకెలాంటి వీడియో కంటెంట్ వదలకుండా హిట్ 3 జాగ్రత్తలు తీసుకుని కథకు గురించి ఎక్కువ చర్చ జరగకుండా తెలివిగా వ్యవహరిస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో ఒక ప్రధాన భాగం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పెహల్గామ్ లో తీశారు.