క్రిష్ తలపెట్టిన ‘కొండ పొలం’ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పవన్‍కళ్యాణ్‍తో అతను మొదలు పెట్టిన జానపద చిత్రం కూడా తిరిగి ప్రారంభమవుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ అది జరిగే వీల్లేదనేది ఇండస్ట్రీ రిపోర్ట్. ఎందుకంటే వకీల్ సాబ్ చిత్రంలోని ఫ్లాష్‍బ్యాక్ సన్నివేశాల కోసం పవన్‍కళ్యాణ్ గెటప్ మారుస్తాడు. ఆ సన్నివేశాలను వకీల్ సాబ్ చివరి షెడ్యూల్లో చిత్రీకరిస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమా గెటప్‍లోకి మారతాడు. ఈ రెండు చిత్రాల్లోను పవన్ తన రెగ్యులర్ హెయిర్ స్టయిల్‍తోనే కనిపిస్తాడు.
కానీ క్రిష్ సినిమాలో మాత్రం కాస్త పెరిగిన జుట్టుతో జులపాలను తలపించే హెయిర్ స్టయిల్‍తో వుంటాడు. కనుక ప్యారలల్‍గా క్రిష్ సినిమా చేసే వీల్లేదు. వకీల్ సాబ్, అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాల షూటింగ్స్ పూర్తయిన తర్వాతే క్రిష్ చిత్రం తిరిగి స్టార్ట్ అవుతుంది. కాకపోతే మార్చి లేదా ఏప్రిల్ నుంచే పవన్ ఆ సినిమాకు రెడీగా వుంటాడు. కనుక దసరా రిలీజ్‍కు ప్లాన్ చేసుకునేలా క్రిష్ తన సినిమాను పూర్తి చేసుకోవచ్చు. ఇదిలావుంటే హరీష్ శంకర్ సినిమా మాత్రం 2022 సమ్మర్‍లోనే వస్తుందని అంటున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన పిమ్మట పవన్ తిరిగి రాజకీయ ప్రచారంతో బిజీ అవుతాడని అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates